మెదక్

సమాజాభివృద్ధికి నూతన పరిశోధనలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 18: శర వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో పరిశోధకులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, ఇందుకు యూజీసీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్, టీఎస్‌సీహెచ్‌ఈ చేయూతనిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైనె్సస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ చెన్న బసవయ్య స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్‌లో శనివారం నిర్వహించిన జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ, చెన్నై, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 217 మంది పరిశోధక విద్యార్థులు హాజరై తమ వ్యాస సంపుటాలు సమర్పించగా, క్వాలిటీ గల అంశాలకు ప్రాధాన్యత నిచ్చి ఎంపిక చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు, విద్యార్థులు, సమాజానికి ఉపయోగపడే పలు అంశాలు ఆవిష్కరింపజేయగా, వీటిలో ఆర్థిక, బ్యాంకులు, విద్య, స్వయం సహాయక గ్రూపులు, వైద్య తదితర రంగాలకు చెందిన వాటికి పరిశోధకులు ప్రాముఖ్యత కల్పించినట్లు పేర్కొన్నారు. అయితే మారుమూల ప్రాంతంలో ఉన్న గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్ నిర్వహించడంతో పరిశోధక విద్యార్థులకు, విద్యావేత్తలకు కూడా ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సెమినార్‌లు నిర్వహించి క్వాలిటీ కలిగిన అంశాలకు అవకాశం కల్పిస్తే అవి సమాజాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వ పథకాల అమలు ఆవశ్యకత ఎంతో ఉందని, రాజకీయాలకు అతీతంగా అవి సమర్థవంతంగా క్షేత్ర స్థాయికి చేర్చాల్సిన బాధ్యత సామాజిక శాస్తవ్రేత్తలు, యునివర్శిటీలు, కళాశాలలు గణనీయమైన మార్పుల దిశగా కృషి చేయాలని అన్నారు. విమర్శ సద్విమర్శగా ఉండాలని, నాణ్యమైన పరిశోధనలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు సెమినార్ డైరెక్టర్‌గా, డాక్టర్ రమేశ్ కన్వీనర్‌గా వ్యవహరించగా, ప్రొఫెసర్‌లు వెంకటేశ్వర్లు, రాములు, ప్రొఫెసర్ నకూలారెడ్డి తదితరులు పరిశోధకులనుద్దేశించి ప్రసంగించారు.