మెదక్

ఉద్యోగం కోసం కాదు..సమాజం కోసం ఆరాట పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 18: ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం ఉబలాట పడవద్దని..మనం జీవిస్తున్న సమాజాన్ని బాగుపర్చేందుకు పెంపొందిన విజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ఆరాటపడాలని భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు హితవు పలికారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ సమీపంలోని గీతం విశ్వ విద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్ట భద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది యువకులు ఉన్నత విద్యలను పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఉబలాటపడుతున్నారని అన్నారు. చదివిన ప్రతి యువకుడికి ప్రభుత్వం ఉద్యోగం లభించడం సాధ్యం కాదన్నారు. చదువులోని విజ్ఞానాన్ని నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఉపాధి పొందుతూ పొరుగు వారికి నీడను కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఏదో సంపాదించుకుని జీవిస్తున్నామన్న తృప్తి కంటే ఇతరులను కూడా పోషించినప్పుడే మానసికంగా సంతృప్తి లభిస్తుందని ఉద్భోదించారు. ప్రపంచం ఎంతో వేగవంతంగా ముందుకు దూసుకుపోతుందని, పోటీ తత్వం ద్వారా కొత్త కొత్త ఆలోచనలతో నూతన ఒరవడిని సృష్టించాలన్నారు. పారిశ్రామికంగా దేశం విస్తరిస్తోందని, ప్రపంచ దేశాలన్ని మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనను పక్కన పెట్టి మనదేశంలో పని చేస్తూ మన దేశ అభివృద్ధిపై మమకారాన్ని పెంచుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగాలపై దృష్టి పెట్టి మానవ అవసరాలను తీర్చే కొత్త విషయాలపై ప్రయోగాలు చేపట్టాలన్నారు. భారతదేశంలో యువతరమే ఎక్కువగా ఉందని, యువత అనుకుంటే సాధించలేనిదంటూ ఉండదన్నారు. విజ్ఞానంతో పాటు వినోదం కూడా ఉండాలంటూ సినిమాలపై చమత్కారంగా మాట్లాడి విద్యార్థులను నవ్వింపజేసారు. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, సౌర విద్యుత్ ఉత్పత్తి, జలవనరుల సంరక్షణ, పారిశ్రామిక విధానం, కుల వృత్తుల ఆవశ్యకతలపై విద్యార్థులకు విపులంగా వివరించారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వెంకయ్య నాయుడు తనదైన శైలీలో ప్రసంగించి అందరిని ఆకట్టుకున్నారు. చలోక్తులు, చమత్కారాలతో మాట్లాడిన ప్రతిసారి సభ చప్పట్లతో మారుమ్రోగింది.