మెదక్

రాష్ట్రానికే శుద్ధిపేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 18 : స్వచ్ఛతకు..పరిశుభ్రతకు మారు సిద్దిపేట. తడిచెత్త, పొడిచెత్త సేకరణ..వందశాతం మరుగుదొడ్లు నిర్మించిన తొలి నియోజక వర్గంగా రాష్ట్రంలో సిద్దిపేట గుర్తింపు సాధించింది. సిద్దిపేట పురపాలక సంఘంతో పాటు, నియోజక వర్గంలోని గ్రామాలు జాతీయ స్థాయిలో ఏన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించి సిద్దిపేట జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దటంతో ప్రత్యేక కృషిచేశారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్ నియోజక వర్గాలు ఓడిఎఫ్‌గా గుర్తింపు పొందాయి. కాగా సిద్దిపేట జిల్లాలో కొత్తగా కరీంనగర్ జిల్లా నుండి చేరిన హుస్నాబాద్, అక్కన్నపేట, కోహేడ, బెజ్జంకి, వరంగల్ జిల్లా నుండి చేరిన చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. అలాగే దుబ్బాక నియోజక వర్గాంలోని కొన్ని మండలాలు సైతం వంద శాతం మరుగుదోడ్ల నిర్మాణంలో వెనుకంజలో నిలిచారు. దీంతో సిద్దిపేట జిల్లా స్వచ్చ జిల్లా ఓడిఎఫ్‌గా సాధించటంలో కొంత జాప్యం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 9 జిల్లాలు ఓడిఎఫ్‌గా గుర్తింపు పొందాయి. 10 జిల్లాగా సిద్దిపేట జిల్లాను రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయని నర్సింహరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులు ఈనెల 19న సిద్దిపేట వేదికగా ప్రకటించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఓడిఎఫ్‌ను తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లాలోని ఓడిఎఫ్‌గా దూరంగా గ్రామాలను గుర్తించి స్వచ్ఛత సాధించేందుకు గ్రామాల్లో వందశాతం మరుగుదోడ్లు నిర్మించేందుకు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకోసం ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లా స్థాయి అధికారులను మండలాలకు స్పెషల్ ఆపీసర్లగా నియమించారు. మండల స్థాయి అధికారులను గ్రామాలకు స్పెషల్ అధికారులకు నియమించారు. గ్రామాల్లో మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రోత్సహం, ప్రజల సహాకారంతో వంద శాతం మరుగుదోడ్ల నిర్మాణం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రతి రోజు గ్రామాల్లో ఎన్ని మరుగుదోడ్లు నిర్మించారో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని మందకోడిగా పనుల సాగుతున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ మున్సిపాల్టీలు, జనగామ నియోజక వర్గంలోని చేర్యాల, కోమురవెళ్లి, మద్దూరు పరిధిలో 2,40,338 వందశాతం మరుగుదోడ్లు నిర్మించి జిల్లాను స్వచ్ఛ జిల్లాగా గుర్తింపు తెచ్చారు. గత నెల అక్టోబర్ 24న సిద్దిపేట జిల్లాను ఓడిఎఫ్ గుర్తింపు తేవాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. 20 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న జిల్లాలోని వివిధ గ్రామాల్లో 26, 294 నిర్మించి లక్ష్యాన్ని సాధించారు. చారు.
నేడు అధికారికంగా ప్రకటించనున్న మంత్రులు నాయిని, తన్నీరు
సిద్దిపేట జిల్లా పరిధిలో 4 మున్సిపాల్టీలు, 399 గ్రామ పంచాయతీల్లో 2,40,338 వందశాత మరుగుదొడ్లు నిర్మించారు. సిద్దిపేట మున్సిపాల్టీలో 37, 765 మరుగుదొడ్లు, దుబ్బాక నగర పంచాయితీలో 6,660, గజ్వేల్‌లో 10,500, హుస్నాబాద్‌లో 5947 నిరిమంచారు. జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలో 60, 922 మరుగుదొడ్లు నిర్మించారు. జిల్లా పరిధిలో 399 గ్రామపంచాయతీల్లో 1,79, 416 మరుగుదొడ్లు నిర్మించుకొని స్వచ్ఛత జిల్లా (ఓడిఎఫ్)గా గుర్తింపు పొందనుంది. ఆదివారం మధ్యాహ్నాం స్థానిక వడ్డెపల్లి పంక్షన్ హాల్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులు అధికారికంగా స్వచ్ఛ జిల్లాగా సిద్దిపేటను ప్రకటించనున్నారు.