మెదక్

ఘనంగా గీతం స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, నవంబరు 18: పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన కళాశాల ప్రాంగణంలోని శివాజి అడిటోరియంలో ఈ వేడుకను అట్టహాసంగా జరిపారు. గీతం విశ్వవిద్యాలయం వైఎస్ ఛాన్సలర్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన కళాశాల ఎనిమిదవ స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉప రాష్టప్రతితో పాటు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ స్నాతకోత్సవములో ఇద్దరు పిహెచ్‌డీ, 56 మంది ఎంబిఏ, వెయ్యి మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసారు. తన చేతుల మీదుగా పట్టాలు అందచేసిన భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యా బోదన ద్వార విద్యార్థిని విద్యార్థులను ప్రపంచ శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అత్యంత విలువైన యువశక్తికి నిలయమైన భారతావనిలో భారీ పరివర్తన చోటుచేసుకుంటోందని, యువతీ యువకులకు అపారమైన అవకాశాలు అంది వస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ పరిశోధకులుగా డాక్టరు త్రినాధరావు, రాంబాబులకు కళాశాల తరపున అవార్డులను అందించారు. మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన కోన రాంప్రకాష్, హరిశంకర్ ముఖర్జీలకు డాక్టరేట్ పట్టాలు అందించారు. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో కళాశాల టాపర్‌గా నిలిచిన నిఖితాశర్మకు బంగారు పతకం, చదువుతో పాటు ఇతరత్రా రంగాలలో ప్రతిభ కనబరిచిన కాకర్ల సుభాష్‌కు అలూమినీ గోల్డ్ మెడల్ ప్రధానం చేసారు. బీటెక్ సీఎస్‌ఇ టాపర్ ఎలిశాల ప్రవళ్లికకు, చల్లా శే్వత, ట్రిపుల్‌లో అత్యధిక మార్కులు సంపాదించిన ఎనుములపల్లి స్నిగ్ధ, సివిల్ ఇంజనీరింగ్ టాపర్ వెంకట అఖిల్‌కు బంగారు పతకాలు కళాశాల తరపున నిర్వాహకులు అందించారు. ప్రకృతిలో కొలువు దీరినట్లు పచ్చని చెట్ల మధ్య నెలకొల్పిన ప్రాంగణంలో జరిగిన గీతం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది.