మెదక్

రూ. 800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 19: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో రూ. 800కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట్‌రాంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ ప్రక్షాళనతో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా సర్కార్ భూములను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుండగా, 356, 119 సర్వే నెంబర్‌లలోని సుమారు 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించి అప్పటి తహశీల్దార్ బాల్‌రెడ్డి బోర్డులు ఏర్పాటుచేయగా, పలుకుబడి కలిగిన పలువురు వాటిని తొలగించి ఆ భూములు మావేనని క్రయవిక్రయాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఈ భూములు ప్రభుత్వ భూములేనని ఆర్డీఓ ఇచ్చిన సర్ట్ఫికెట్లతో మాజీ మంత్రి డీకే అరుణ, బీజేపీ ఎల్‌పీ నేత కిషన్‌రెడ్డిలను కలసి అసెంబ్లీలో సీఎం దృష్టికి తేవాలని కోరినట్లు ఆయన తెలిపారు. కాగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌ల నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల్లు నిర్మించి ఇవ్వాలని, రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రయోజనార్థం ఈ భూములను వినియోగించాలని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు రాగా, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ క్రింది స్థాయిలో చలనం లేకపోవడంతో తిరిగి జిల్లా కలెక్టర్, ఆర్డీఓలకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు అందజేసినట్లు వివరించారు.

ఘనంగా స్ర్తిశక్తి దివస్

సంగారెడ్డి టౌన్, నవంబర్ 19: ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవించింది అతి తక్కువ కాలమైనా మహిళలకు, సమాజానికి మంచి సందేశం ఇచ్చిందని ఎబివిపి జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక బిసి విద్యార్థినుల వసతి గహంలో స్ర్తిశక్తి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్న తరుణంలో రాజకీయంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎబివిపి నాయకులు అశోక్, స్వాతి, వౌనిక, సవిత, లలిత, వినోదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.