మెదక్

ఉల్లిధర పైపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 11: మెదక్ జిల్లా కేంద్రంలో ఉల్లిగడ్డ ఘాటెక్కింది. ఒకప్పుడు ఉల్లిగడ్డ ధరలతో కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కిలో ఉల్లిగడ్డ ధర 60 రూపాయలకు పెరిగింది. సామాన్య మానవుని నుంచి ఉన్నత వర్గాల వరకు వంట గదిలో ఉల్లిగడ్డ వినియోగిస్తుంటారు. అలాంటి ఉల్లిగడ్డ కిలో 60 రుపాయలకు పెరిగింది. మిగిలిన కూరగాయలు ధరలు తగ్గాయి. టమాట 60 రూపాయల నుంచి 30కి తగ్గింది. మిగిలిన కూరగాయలు కూడా ధరలు తగ్గుముఖం పట్టాయి. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిగడ్డ ధరను నియంత్రించకపోవడంతో దాని ధర పేట్రేగిపోతోంది. దాంతో ప్రజలు ఉల్లిగడ్డను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఉల్లిగడ్డ ధర పెరిగినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మెదక్ వ్యవసాయ మార్కెట్ ద్వారా కిలో రూ.7కే ఉల్లిగడ్డను అమ్మకాలు జరిపిన చరిత్ర ఉంది. కానీ ఇప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిగడ్డ ధర పెరిగినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మల్లన్న కల్యాణం ఘనంగా చేద్దాం
* భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి
* ఆలయ నిర్వాహకులకు మంత్రి హరీష్‌రావు సూచన
సిద్దిపేట, డిసెంబర్ 11 : సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహంచాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, ఆలయ ఈఓ రామకృష్ణ, అర్చకులు కలసి మల్లన్న కల్యాణ పత్రికను మంత్రి హరీష్‌రావు నివాసంలో అందచేశారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మల్లన్న జాతర ఉత్సవాలు, కల్యాణాన్ని కన్నుల పండవగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండ అవసరమగు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 17న జరిగే మల్లికార్జున స్వామి కల్యాణం బ్రహ్మండంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 3నెలల పాటు జరిగే జాతరకు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండ అవసరమగు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లన్న జాతర ఉత్సవాలు సిద్దిపేట జిల్లాకు తలమానికంగా నిలవాలన్నారు. కొమురవెళ్లి మల్లన్న క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఉత్సవాల లోపు పూర్తి చేయాలన్నరు. 17న జరిగే మల్లన్న కల్యాణానికి ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.

సన్నాహక సభలో సంస్కృతి వైభవం
సిద్దిపేట, డిసెంబర్ 11 : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జానపద కళారూపాల ప్రదర్శన సిద్దిపేట ప్రజలను ఎంతో ఆకట్టుకొని, అబ్బురపర్చింది. జానపద కళారూపాల ప్రదర్శన ర్యాలీని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అడిషనల్ సీపీ నర్సింహరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఎన్జీఓ భవన్ నుండి యక్షగానం, ఒగ్గుకథ, పోతరాజుల విన్యాసం, డప్పుల దరువు, పులివేషాలు, ఆట, పాటలతో 200 మంది కళాకారుల ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సందడిగా సాగింది. వేంకటేశ్వరాలయం నుంచి మెదక్ రోడ్డు మీదుగా అంబేద్కర్ చౌరస్తా, శివమ్స్ గార్డెన్ వరకు అట్టహాసంగా కళాకారులు, వివిధ కళారూపాలు ప్రదర్శిస్త్తూ ర్యాలీని నిర్వహించారు.
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలి: చైర్మన్ రాజనర్సు
తెలంగాణ సర్కార్ డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తెలిపారు. స్థానిక శివమ్స్ గార్డెన్‌లో జరిగిన జానపద కళారూప ప్రదర్శన కార్యక్రమానికి హజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాల నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా తెలంగాణ భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మన భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఆధరణకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కళలు, సంప్రదాయాలు, భాషపై మమకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర సాధనకు కవులు, కళకారులు ప్రముఖ పాత్ర పోషించారని, తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత 550 కళాకారులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. జిల్లాలో మంత్రి హరీష్‌రావు సూచనలు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో సన్నాహక కార్యక్రమంలో భాగంగా సాహిత్య, భాష కార్యక్రమాలు, జానపద కళారూపాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట కళాకారులకు, సాహిత్య వేత్తలకువ పుట్టినిల్లు అన్నారు. సంప్రదాయ కళారూపాలైన జానపద కళ రూపాల ప్రదర్శన నిర్వహించటం ఆనందదాయకమన్నారు. కోకన్వీనర్ వేణుమాధవరెడ్డి, డీపిఆర్‌ఓ శ్రీనివాస్, జిల్లాసమన్వయకర్త రంగాచారి నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మన్, సారయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య, జిల్లా యువజన క్రీడల అభివృద్థి అధికారి బాలయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, నేతలు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.