మెదక్

సమైక్యాంధ్ర పాలనలో దగాపడ్డ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, డిసెంబర్ 12: సమైక్యాంధ్రుల పాలనలో తెలంగాణా అన్నింటా వెనుకబాటుకు గురైందని.. మూడున్నరేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో 60 ఏళ్ల దరిద్రాన్ని పారదోలి అభివృద్ది పథంవైపు దూసుకపోతుందని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లింగాపూర్ బంజెరుపల్లి గ్రామంలో 20లక్షల సిసి రోడ్డు పనులు ప్రారంభించి, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దగాపడ్డ తెలంగాణాను అభివృద్ది చేసేందుకే కెసిఆర్ తెలంగాణ సాధనకోసం అలుపెరగని పోరాటం చేసి, సాధించి నేడు సిఎంగా అభివృద్దిని వేగవంతం చేస్తున్నాడన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎంపిపి గంట రేణుక, జడ్‌పిటిసి రూపా, ఎంపిడిఓ రాజిరెడ్డి, ఏఎంసి చైర్మన్ బక్క కనకయ్య, పిఏసిఎస్ చైర్మన్ మల్లేశం, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచ్‌లు మంతూరి లతా సత్యనారాయణ, తోయేటి ఎల్లం, అక్కం స్వామి, చాట్లపల్లి రాజాగౌడ్, భాస్కర్, ఎంపిటిసి అల్వాల దేవేంద్ర, పాత్కుల లీలావతి, నాయకులు నరెందర్‌రెడ్డి, రవిందర్, రమేశ్, జహంగీర్, లక్ష్మణ్, అశోక్, నర్సింలు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
సామాజిక స్పృహ కల్పించాలి
విద్యలో రోజు రోజుకు సామాజిక స్పృహ లోపిస్తుందని.. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించాల్సిన గురుతర బాధ్యత అధ్యాపకులదేనని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం తొగుట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వంత నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ కేంద్రం, డిజిటల్ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యావ్యవస్థ నిర్వర్విమైందన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో విద్యా వ్యవస్థను కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1133 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. దీంతో దుబ్బాక నియోజక వర్గంలో 17 పోస్టులు భర్తీకానున్నాయన్నారు. డిజిటల్ విజ్ఞానం మంచిదేనని, మంచి ఎంత ఉంటుందో చెడు సైతం అంతే ఉంటుందన్నారు.
మృతుల కుటుంబానికి పరామర్శ
మండలంలోని లక్ష్మాపూర్, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వంగ అంజాగౌడ్, బుర్ర కృష్ణమూర్తిల కుటుంబాలను మంగళవారం ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ ఫరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపిటిసి ప్రతాప్‌రెడ్డిని పరామర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు లక్ష్మాపూర్ గ్రామస్థులు భూములు ఇచ్చేందుకు స్వచ్చంధంగా ముందుకు వచ్చారని వారికి పరిహారాలు త్వరితగతిన చెల్లించాలని తహశీల్దార్‌ని ఆదేశించారు.

రాహుల్ గాంధీ ఎన్నిక పట్ల వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
* సిద్దిపేటలో యూత్ కాంగ్రెస్ సంబురాలు
సిద్దిపేట, డిసెంబర్ 12 : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం పట్ల సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ర్యాలీగా తరలివచ్చారు. ఆనంతరం కాంగ్రెస్ నేతలు టపాటసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తు సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ 2004లో క్రీయశీల రాజకీయాల్లో వచ్చి ఉత్తర్‌ప్రదేశ్ అమేథి నుండి లోక్‌సభకు పోటీ చేసి భారీ విజయం సాధించి తన రాజకీయ ప్రస్తానాన్ని చాటారన్నారు. 2007లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా చేపట్టి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసినట్లు తెలిపారు. యూత్‌కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ చైర్మన్‌గా బాధ్యలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముఖ యువత అని చాటిచెప్పాడన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చి ఏంతో మందికి కాంగ్రెస్ పార్టీలో చేర్పించినట్లు పేర్కొన్నారు. 2013లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధి కొరకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కార్ అధికారంలోకి రాగానే రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా ల్యాండ్ ఆక్యుషన్ బిల్లు తీసుకవస్తే ఆ బిల్లు చెల్లనివ్వకుండ రాహుల్‌గాంధీ కృషిచేశారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో టీపీసీసి ఎస్సీ సెల్ కార్యదర్శి బొమ్మల యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క సతీష్, కార్యదర్శి అత్తుఇమామ్, నాయకులు కలీమోద్దీన్, షాబోద్దీన్, సుభాష్, గోపికృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, నరేష్, కిరణ్, కానోజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.