మెదక్

గుండెపోటుతో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 17: సిద్దిపేట మండలం నారాయణరావుపేట గ్రామానికి చెందిన పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గుర్రం నారాయణరెడ్డి గుండెపోటుతో ఆదివారం మృతిచెందాడు. సిద్దిపేట మండలం మల్యాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నారాయణరెడ్డి స్వగ్రామంలో ఆదివారం మృతిచెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే నారాయణరెడ్డి మృతితో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోధనలు అందరిని కంట తడిపెట్టించాయి. నారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్థులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు.
మంత్రి హరీష్‌రావు తీవ్ర సంతాపం
ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి నిరాడంబరమైన వ్యక్తి అని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని మంత్రి హరీష్‌రావు అన్నారు. అలాంటి ఉపాధ్యాయుడి మృతి సమాజానికి తీరని లోటన్నారు. కల్మశం లేని వ్యక్తి నారాయణరెడ్డి అని ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రాగాడ సానుభూతిని తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల సంతాపం
పిఆర్‌టియు నేత నారాయణరెడ్డి అందరితో కలుపుగోలుగా ఉండి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుండే వ్యక్తిఅని ఆయన అకాల మృతి సంఘానికి తీరని లోటని పిఆర్‌టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, నరెందర్‌రెడ్డిలు అన్నారు. అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు టిఎస్‌పిటిఏ, టిపిటిఎఫ్, ఎస్టీయు, హెచ్‌ఎంల సంఘం, డిటిఎఫ్, తపస్, యుటిఎఫ్ సంఘాల నేతలు పిట్ల రాజయ్య, వైవి సురేశ్‌కుమార్, గడ్డం తిరుపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జైన సత్యం, రంగారావు, రిక్కల రవిందర్‌రెడ్డి, తిరుపతి, గనె్న రాజిరెడ్డి, చంద్రారెడ్డి, రాజిరెడ్డి, యాదగిరి, చంద్రబాను, ఆస లక్ష్మణ్, పురమాండ్ల రవిందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటరాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, పొన్నమల్ల రాములు, సత్యనారాయణ, వెంకటరాజం, నోడల్ అధికారి రఘోత్తంరెడ్డి, ఎంఇఓ యాదవరెడ్డి, డిఎస్‌ఓ మహేందర్‌లు తీవ్ర సంతాపం తెలిపారు.