మెదక్

ఘనంగా కృష్ణానంద స్వామి ఆరాధనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, డిసెంబర్ 17: మానవుడు జీవితంలో శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలోనే కొనసాగించాలని తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని రంగంపేట శివారులోని నూతన ఆశ్రమంలో గత రెండు రోజులుగా కృష్ణానంద స్వామి ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అక్కడికి వచ్చిన భక్తులకుపలు ప్రవనాలు తెలిపారు. మానవుడు తన శేష జీవితంలో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుంటే బాగుటుందని, అలాగే తల్లిదండ్రులను, గురువులను, పురోహితులు, మేధావులను గౌరవించే సంప్రదాయాన్ని మానవుడు నేర్చుకోవాలని సమావేశానికి వచ్చిన భక్తులకు ప్రవచనాలు ఇచ్చారు. తల్లిదండ్రులకు పిల్లలు వారిని తీసుకువెళ్లి వృద్దాప్య ఆశ్రమంలో పెట్టడం మంచిది కాదని, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విస్మరించడం సరికాదన్నారు. ఈ సమావేశానికి హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమాన్ని నూతనంగా నిర్మించినందుకు నర్సాపూర్ తాలూకలో కొల్చారం మండలం కావడం తాను అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆశ్రమానికి కావాల్సిన సీసీ రోడ్డు, తాగునీటి సమస్యను మిషన్ భగీరథ ద్వారా తీర్చుతామన్నారు. ఆధ్యాత్మిక చింతన పొందినప్పుడు ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్వామిజీకి పాదాభివందనం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, మాజీ అధ్యక్షులు గౌరిశంకర్, ఏఎంసీ డైరెక్టర్ రాజాగౌడ్, నాయకులు అంజనేయులు, ప్రభాకర్, భానుప్రకాశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.
స్వామిజీ ఆశీర్వాదం పొందిన డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి హాజరై స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కొల్చారం మండలంలో నూతన ఆశ్రమం ఏర్పాటు కావడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సుక్రుతమని ఆమె కొనియాడారు. ఇక్కడి ప్రజలు ఆయురారోగ్యాలతో భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆమె వెంట జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, ఆప్కో డైరెక్టర్ అరిగె రమేశ్‌కుమార్, ఎంపీపీ అధ్యక్షురాలు రజిని రమేశ్, నాయకులు మల్లేశం, వెంకటేశం తదితరులు ఉన్నారు.

అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చాలి

* మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్
జోగిపేట, డిసెంబర్ 17: అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి సిఆర్.దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం అందోల్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. అందోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగిందన్నారు. దళితుల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అంబేద్కర్ సిద్దాంతాలు, ఆశయాలను పాటించడం లేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దళితులు అభివృద్ది చెందారన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు దళితుల అభివృద్దిపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందోల్ మండల ఉపాధ్యక్షులు రమేశ్, సాహాసం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాశ్, టీఆర్‌ఎస్ నాయకులు సంజీవయ్య, క్రాంతి సేన అధ్యక్షులు కృష్ణ, అందోల్ జడ్పీటీసీ శ్యామమ్మ, అక్సాన్‌పల్లి సహకార సంఘం అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, జోగిపేట మాజీ మార్కెట్ కమిటి చైర్మన్లు కృష్ణారెడ్డి, పద్మనాభరెడ్డి, యువజన సంఘాల నాయకులు బ్రహ్మానందరెడ్డ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.