మెదక్

పర్యాటక క్షేత్రంగా కొమురవెళ్లి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 17 : కొమురవెళ్లి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రముఖ శైవ క్షేత్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. వచ్చే ఏడాది కల్లా గోదావరి జలాలు తీసుకొచ్చి మల్లన్న మొక్కులు చెల్లిస్తానన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమరవెళ్లి మల్లన్న కల్యాణంలో ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు అందచేశారు. ఆనంతరం మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో విలేఖరులతో మాట్లాడుతూ ఏడాది పాటు ఎప్పుడు జాతర ఉండే అద్బుత క్షేత్రం కొమురవెళ్లి మల్లన్న ఆలయమన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీటితో కొమురవెళ్లి మల్లన్న స్వామికి అభిషేకం చేస్తామన్నారు. స్వామిదయతో వచ్చే ఏడాది గోదావరి జలాలతో ఈప్రాంత మంత సస్యశ్యామలం చేస్తామన్నారు. మల్లన్నస్వామి దయతో సుభిక్షంగా ఉండాలని ఆక్షించారు. మల్లన్న స్వామి దయతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. మల్లన్న పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆలయ ముఖద్వారం నుండి ప్రధాన ఆలయం వరకు వెండి తొడుగు ఏర్పాటు చేస్తామని, ఆలయ సమీపంలో శాశ్వత కల్యాణ మండపం నిర్మిస్తామని పేర్కొన్నారు. మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు పర్యాటక పరంగా ఆకర్శించేలా మల్లన్న చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 10 కోట్లతో పాటు, మరో 10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కొమురవెళ్లి మల్లన్న క్షేత్రాన్ని అద్బుత క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

* పలు వార్డుల్లో సీసీ డ్రైనేజ్‌లకు శంకుస్థాపన
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 17: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 13,14,15,16,17వ వార్డుల్లో సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. బైక్‌పై వార్డుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో జిల్లాకేంద్రమైన సంగారెడ్డి అభివృద్ధికి అమడ దూరంలో ఉందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో పట్టణంలో రూ.67కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరిగిన అభివృద్ధి కొంతేనని జరగాల్సింది కొండంత ఉందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ అభివృద్ధి పనులకు రూ.5కోట్లు విడుదల చేశారని, ఈ పనులు పూర్తికాగానే మరో 5కోట్లు కేటాయిస్తారని, వీటితో పాటు మరో 20నుండి 25కోట్ల రూపాయలను కేటాయించేందుకు మంత్రి హరీష్‌రావు హామినిచ్చారన్నారు. వార్డుల్లో పర్యటించి అత్యవసర పనులకు ఈ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. పోరాటాల ద్వారా సాధించికున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఐసిడిఎస్ డైరెక్టర్ లక్ష్మి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశం, నాయకులు జలాలోద్దీన్‌బాబా, జావీద్, ఎంఐఎం కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.