మెదక్

అన్నా సత్యగ్రహానికి 5 వేల మందిని ఢిల్లీకి తరలిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 16: లోక్‌పాల్ బిల్లు, స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మార్చి 23న ప్రారంభం కానున్న అన్నా హజారే సత్యగ్రహానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఐదు వేల మందిని తరలిస్తానని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఐక్య వేదిక అధ్యక్షులు అందోల్ క్రిష్ణ హామి ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాట్లు, నిధులు, జనసమీకరణలపై 16 రాష్ట్రాల ప్రతినిధులతో అన్నా హజారే నిర్వహించిన సమావేశంలో అందోల్ క్రిష్ణ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పది వేల మందిని తరలించాలని సూచించగా ఆర్థికపరమైన ఇబ్బందుల దృష్ట్యా ఐదు వేల మందిని తప్పనిసరిగా తరలిస్తానని హామి ఇచ్చినట్లు తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా సత్యగ్రహంలో ఓ అంశంగా చేర్చాలని క్రిష్ణ కోరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో నిర్వహించే సన్నాహక సమావేశంలో చర్చిద్దామని అన్నా హజారే హామి ఇచ్చినట్లు కృష్ణ వివరించారు. కాగా హైటెన్షన్ టవర్ల బాధితుల విషయమై అన్నాతో గళమెత్తించి బాధితులకు న్యాయం చేకూర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దేశానికే రోల్‌మోడల్ ఇబ్రహీంపూర్
సిద్దిపేట అర్బన్, జనవరి 16: దేశానికే రోల్ మోడల్‌గా సిద్దిపేట మండలం ఇబ్రహింపూర్ గ్రామం నిలిచిందని జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం కితాబునిచ్చింది. మంగళవారం నాడు ఇబ్రహింపూర్ గ్రామాన్ని ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర కోఆర్డినేటర్ అనురాధ నేతృత్వంలో 12 మంది సభ్యుల గ్రామ కార్యదర్శుల బృందం గ్రామాన్ని సందర్శింది. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టిన పనులను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం, వౌళిక వసతుల కల్పన, హరితహారం, డంపింగ్ యార్డు నిర్మాణం, గొర్రెల షెడ్‌ల నిర్మాణం, శ్మశాన వాటికల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇబ్రహింపూర్ దేశానికే ఆదర్శంగా పనులు జరిగాయన్నారు. తాము ప్రసార మాధ్యమాల్లో చూశామే తప్ప ఇంత అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడలేదని వెల్లడించారు. గ్రామంలో నగదు రహిత లావాదేవిలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు చాలభాగా పెరిగాయన్నారు. ఉపాధి హామీ పథకంను సమన్వయం చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో 27 రకాల పనులను గ్రామ అభివృద్ధికి ఉపయోగంచుకోవడం అభినందనీయమన్నారు. డంపు యార్డు ద్వారా చెత్త సేకరణ బాగుందన్నారు. ఇబ్రహింపూర్ గ్రామం స్పూర్తితో తాముకూడా తమ ప్రాంతంలో ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చి దిద్దుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సమ్మిరెడ్డి, సర్పంచు కుంబాల లక్ష్మీ, నేతలు ఎల్లారెడ్డి, నగేశ్, రాజు బృందం సభ్యులు పాల్గొన్నారు.