మెదక్

సంక్రాంతి సంబురాల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ కంగ్టి జనవరి 16: ఊరంతా.. సంక్రాంతి సంబురాలు జరుపుకుంటుంటే రెండు కుటుంబాలకు విషాదఛాయలు అలుముకున్నాయ. సోమవారం రాత్రి కంగ్టి మండలం చాప్టాలో చోటుచేసుకున్న సంఘటన చూపరులను కంటతడిపెట్టించింది. కంగ్టి ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. నాగిల్‌గిద్దా మండలం ఎనక్‌పల్లి గ్రామానికి చెందిన బస్వరాజ్ (30) సోమవారంనాడు సాయంత్రం స్వగ్రామం నుంచి బైకుపై బంధువుల ఇంటికి సంక్రాంతి సంబురాలు జరుపుకునేందుకు బయలు దేరి కంగ్టి మీదుగా చాప్టానుంచి తడ్కల్ వైపు బైకుపై వేళ్తుండగా కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామానికి చెందిన రఘరాం (27) తడ్కల్ నుంచి బైకుపై స్వగ్రామం చాప్టాకు వస్తున్నారు. తడ్కల్ మధ్యన ఇరుబైకుల ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇనక్‌పల్లికి చెందిన బస్వరాజ్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాణాయపాయి స్థితిలో ఉన్న రఘురాంను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి అదే రాత్రి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రఘురాంమంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఇద్దరి మృత దేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను వారివారి కుటుంబాలకు అప్పగించారు. ఈమేరకు ఇరు కుటుంబీకుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసునమోదుచేసుకుని దర్యాప్తూ చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. ఖేడ్ ఆసుపత్రి వద్ద రెండు కుటుంబీకులు, వారి బంధువులు రోదనలతో కిక్కిరిగా మారిపోయింది. ఎనక్‌పల్లి, చాప్టాకె గ్రామంలో సంక్రాంతి పండుగలో యువకుల మృతి వార్త దావనంలా వ్యాపించింది. మృతులను చూసేందుకు వందలాది మంది ఆసుపత్రికి తరలి వచ్చారు. మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.