మెదక్

గజ్వేల్‌లో సీఎం పర్యటనను అడ్డుకునే యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 17: గజ్వేల్ పట్టణంలో బుధవారం సీఎం కేసీఆర్ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించడానికి చేరుకోగా, ప్రజ్ఞాపూర్ రోడ్డులోని వివేకానంద విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ముండ్రాతి కృష్ణ, సింహాచలంలు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్‌కి ఎదురుగా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ శేషురాంనాయక్ తేరుకొని వారిద్దరినీ పోలీసుల సహాయంతో పక్కకు లాగడంతోపాటు తన వాహనంలో ఎక్కించుకొని జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే మంద కృష్ణపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వారు ఆందోళనకు దిగగా, బేషరతుగా మంద కృష్ణను విడుదల చేయడంతోపాటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్కార్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
బాబుమోహన్‌కు వ్యతిరేకంగా పంచాయతీ పాలకవర్గం నిరసన ర్యాలీ
జోగిపేట, జనవరి 17: అందోల్ శాసనసభ్యులు బాబుమోహన్‌కు వ్యతిరేకంగా బుధవారం జోగిపేట పట్టణంలో అందోల్, జోగిపేట నగరపంచాయతీ పాలకవర్గం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అందోల్, జోగిపేటలో జరిగే అభివృద్ది పనులకు బాబుమోహన్ అడ్డు తగులుతున్నట్లు వారు ఆరోపించారు. పట్టణంలో బాబుమోహన్ ఒత్తిడి వల్లనే ఇప్పటి వరకు చాలా మంది కమీషనర్లు బదిలీ కావడం జరిగిందన్నారు. ఆయన పద్దతి మార్చుకునేంత వరకు తాము ఉద్యమాలు చేస్తామని పాలకవర్గం హెచ్చరించింది. మహిళా చైర్మన్‌ను వేధించడం సరికాదన్నారు. బాబుమోహన్ నిర్లక్ష్యం వల్ల అందోల్, జోగిపేటలో కోట్లాది రుపాయల అభివృద్ది పనులు నిలిచిపోవడం జరిగిందన్నారు. అనంతరం జోగిపేట పట్టణంలో అందోల్, జోగిపేట నగరపంచాయితీ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోగిపేట చైర్మన్ కవిత, వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు శరత్‌బాబు, సునీల్, ప్రదీప్‌గౌడ్, లక్ష్మీ, నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.