మెదక్

మెదక్ కలెక్టరేట్‌పై క్లారిటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జనవరి 17: మెదక్ కలెక్టరేట్ నిర్మాణంపై గత కొన్నాళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. హవేళీఘణాపూర్ మండలం ఔరంగాబాద్ శివారులో(మెదక్ హౌసింగ్ బోర్డు పక్కన) నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ వచ్చిన ముఖ్యమంత్రితో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణంపై చర్చించారు. కలెక్టరేట్‌తోపాటు జిల్లా పోలీసుల కార్యాలయం తదితర భవనాలు నిర్మాణం చేయాల్సి ఉంది. అందరికి అందుబాటులో ఉండేలా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదించారు. 32 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వగా అధనంగా మరో 50 ఎకరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వారం రోజుల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా శంఖుస్థాపన చేసే అవకాశం ఉంది.
జెసి స్థల పరిశీలన
కలెక్టరేట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కెసిఆర్ క్లారిటీ రావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ నగేశ్ ఔరంగాబాద్ శివారులో ప్రతిపాదిత స్థల పరిశీలన చేశారు. ఇదివరకు ప్రతిపాదించిన 32 ఎకరాలతోపాటు అధనంగా సేకరించాల్సిన 50 ఎకరాల అసైన్డ్ భూములను పరిశీలించారు. సమగ్ర సర్వే గురువారం ఉదయం వరకు పూర్తిచేయాలని ఆర్‌డిఓ నగేశ్, తహశీల్దార్ సత్యనారాయణలను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, గ్రామ మాజీ సర్పంచ్ రాజులు జాయింట్ కలెక్టర్‌తో కలెక్టర్‌తో మాట్లాడుతూ మా గ్రామ రైతులు ఇబాధిత రైతులు, గ్రామ మాజీ సర్పంచ్ రాజులు జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడుతూ మా గ్రామ రైతులు ఇక్కడి భూములపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారని, కలెక్టరేట్ కోసం భూములు తీసుకోవడం వల్ల నష్టపోతామన్నారు. తగు న్యాయం చేయాలని కోరగా భూసేకరణ చట్టం మేరకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు.
తొలిగిన ప్రతిష్ఠంభన
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణంపై ప్రతిష్ఠంభన తొలగింది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. గత అక్టోబర్ 11న కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా శంఖుస్థాపన చేసిన విషయం తెల్సిందే. కాగా మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం ఔరంగాబాద్, రాజ్‌పకలెక్టరేట్ నిర్మాణం కోసం ఔరంగాబాద్, రాజ్‌పల్లి శివారులోని భనిర్మాణం కోసం ఔరంగాబాద్, రాజ్‌పల్లి శివారులోని భూములను గుర్తిస్తు సిసిఎల్‌ఎకు కలెక్టర్ నుండి ప్రతిపాదనలు పంపారు. కానీ ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సుమారు మూడు నెలల తర్వాత మెదక్ కలెక్టరేట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి క్లారిటినిచ్చారు. కలెక్టరేట్ భవన నిర్మాణంకు సంబంధించిన టెండర్ ప్రిక్రియ, గుత్తేదారు నియామకం ఇప్పటికే పూర్తయ్యింది. ఔరంగాబాద్ శివారులో మట్టి నమూనాలు సైతం సేకరించారు. సదరు గుత్తేదారు అవసరమైన ముడి సరుకు తయారీకి సంబంధించిన పనులు మొదలుపెట్టాడు.