మెదక్

తూప్రాన్, గజ్వేల్‌కు వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 17: మెదక్ జిల్లా తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ నియోజకవర్గంలో 11 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి ఇరువురి ప్రోత్సాహంతో తూప్రాన్‌లో సీసీ రోడ్లు, డ్రైన్స్‌కు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వైకుంఠధామం నిర్మాణం విషయంలో జిల్లా కలెక్టర్‌కు ఆదేశించానని, సుందరీకరణ విషయంలో కూడా ఆదేశించినట్టు తెలిపారు. తూప్రాన్‌లో డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా షాదీఖానకు 20 లక్షలు, ఖబరస్థాన్‌కు 15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఎంపీ ప్రభాకర్, నర్సింహారెడ్డి కోరిక మేరకు తూప్రాన్ నియోజకవర్గంలో 500 డబుల్ బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ అభివృద్ధి పనుల విషయంలో గురువారం ఉత్తర్వులు జారీ చేస్తానని సీఎం ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కమ్యూనిటీ హాల్స్ లేవని సీఎం తెలిపారు. ఒక్కొక్క కమ్యూనిటీ హాల్‌కు కోటి రూపాయల వంతున ఆరు మండలాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అదే విధంగా తూప్రాన్‌లో మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనేక సేవలలో భాగంగా ప్రజల అభివృద్ధిని ఈ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబుమోహన్, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.