మెదక్

క్రీడల్లో గెలుపు, ఓటమి సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట, జనవరి 17: క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్‌రెడ్డి బుధవారం అన్నారు. శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో స్వర్గీయ నాయిని గోపాల్‌రెడ్డి జ్ఞాపకార్దంముందుకు సాగాలని సూచించారు. క్రీడలలో గెలుపొందిన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. క్రీడల దేహదారుడ్యానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువులోనే కాకుండా క్రీడల్లో యువత ముందుండాలని ఆయన సూచించారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. జిల్లా స్థాయి ఎదిగి పేరు ప్రతిష్టలు తీసుకురావలని ఆయన కోరారు. గ్రామంలో స్వర్గీయ గోపాల్‌రెడ్డి లేని లోటును తీర్చుతానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ఆశిస్సులతో ప్రజల అభివృద్దికి దోహదపడతానన్నారు. గోపాల్‌రెడ్డి గురించి చెప్పడానికి సమయం చాలదని ఆయన గుర్తు చేశారు. భగవంతుని ఆశిస్సులతో గ్రామాన్ని అభివృద్ది పరుస్తానని ఎమ్మెల్యే మరోసారి గుర్తు చేశారు. స్వర్గీయ గోపాల్‌రెడ్డి జ్ఞాపకార్దం నూతన భవనానికి ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పిల్లుట్ల గ్రామానికి వీధి లైట్లు మంజూరు చేస్తున్నట్లు సభలో తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు మంజీర నది ఉన్నందున సీఎం కేసీఆర్ చెక్‌డ్యామ్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బహుమతులు, మెమోంటోలను అందజేశారు. ఇందులో ప్రథమ బహుమతి దౌల్తాబాద్, రెండవ బహుమతి పిల్లుట్ల, మూడవ బహుమతి గోమారం జట్టు అందుకున్నట్లు తెలిపారు. అనంతరం నాయిని రాజేందర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డిలను ఎమ్మెల్యే పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రాగౌడ్, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, నర్సాపూర్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు అర్జున్, రాజేశ్‌గుప్త, ఎంపీటీసీ మన్సుర్, మాజీ సర్పంచ్‌లు రాంమోహన్‌రెడ్డి, సాయిలు, తెరాస నాయకులు రాజేందర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఏసాములు, బాలేష్, నెల్లూరు తదితరులు పాల్గొన్నారు.