మెదక్

రుణ మాఫీలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 17: రైతులకు ఇచ్చిన రుణమాఫీలో ప్రభుత్వం విఫ లమైందనని పీసీసీ కార్యదర్శి మాదాడి జశ్వంతరెడ్డి, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎక్బాల్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గుంటుకు మల్లేషంలు విమర్శించారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్ సర్కార్ అధికారం చేపట్టి 4 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడం సిగ్గుచేటని, చెల్లించిన డబ్బులు సైతం వడ్డీకే సరిపోతున్నట్లు నిలదీశారు. ముఖ్యంగా ఎన్నికల సందర్బంగా సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు గుప్పించి అధికారం చేపట్టగా, ఏ ఒక్క హామీని సైతం పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవని స్పష్టం పేర్కొన్నారు. అలాగే పేద దళితులకు మూడెకరాల భూపంపిణీ చేపడతామని, అర్హులైన పేదలందరికి డబల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, నిరుద్యోగులందరికి ఉద్యోగాలు ఇస్తామని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని, విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని, ఖాళీ పోస్టుల భర్తీని చేపడతామని ఇచ్చిన హామీ హామీగానే నిలిచిపోయినట్లు స్పష్టం చేశారు. అయితే అభివృద్దికి కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకాదని, ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్ల విస్థరణతో నష్టపోయిన బాదితులను ఆదుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే న్యాయం జరగని పక్షంలో నిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింహాచారి, బాలకృష్ణారెడ్డి, నేతలు బైరం శివకుమర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేషం, యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.