మెదక్

గుండువాగులోకి సింగూర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేక్మాల్, జనవరి 19: గుండువాగులోకి సింగూర్ జలాలు మళ్లించి టేక్మాల్ మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం టేక్మాల్‌లో రూ. 5 కోట్ల 77 లక్షలతో నిర్మించిన ఆదర్శ పాఠశాల భవనం, వసతిగృహం, జూనియర్ కళాశాల అదనపు గదులను, గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనశాలలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని గుండువాగు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ చేతిలోనుండి గుండువాగు ప్రవహిస్తున్న ఆ నీటిని టేక్మాల్‌వాసులు వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఉన్న గుండువాగు కలను సాకారంచేసి ప్రతినీటిబొడ్డును టేక్మాల్ మండల రై తాంగం వాడుకొని అభివృద్ది చెందాలనే ఆశయంతో కంకణం కట్టుకొని ము ందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని పిల్లలను సమకూర్చుకోడానికి కేసీఆర్ చూపుతున్న శ్రద్ద ఎనలేనిదన్నారు. కార్పోరేట్ స్థాయిలో అధునాతన భవనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించడం జరిగిందని, విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. ఇల్లు కంటే పాఠశాల, హాస్టల్ వసతులు బాగుందనే భావన విద్యార్థులకు కలిగేవిధంగా సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. 750 ఇచ్చే మెస్ చార్జీలు వెయ్యి 50కి పెంచడం జరిగిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతి రోజు గుడ్డు, అరటిపండు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒ క్కో విద్యార్థికి నాలుగు జతల దుస్తులు, బ్లాంకేట్స్, ఎల్‌ఈడీ టీవీ, ల్యాబ్‌ల సౌకర్యం కల్పించిందన్నారు.
* 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించకుండా తల్లిదండ్రులు ఆడపిల్లలను లక్ష్మీదేవిగా భావించాలన్నారు. మండల పరిధిలోని 23 మంది లబ్దిదారులకు ఎ మ్మెల్యే చేతుల మీదుగా కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఏ ముఖ్యమం త్రి చేయనివిధంగా ఆడపిల్లల పెళ్లిలకు ఆర్దిక సహాయంతోపాటు గర్భిణీ నుండి ప్రసవం వరకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్లు, ఆర్దికంగా చేయూత అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమ ంలో డీఈ జగనాథం, ఏఈ మహేశ్, తెరాస మండల అధ్యక్షులు యూసూబ్, బీరప్ప, సిద్దయ్య, జిల్లా గిరిజనశాఖ అధికారి కోటాజి, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, అయా శాఖల అధికారులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ జానకీరాం, ప్రజాప్రతినిధులు వరలక్ష్మీ, వసంత, జనార్దన్‌రెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్, రంజిత్‌రె డ్డి, ఎల్లయ్య, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.