మెదక్

శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 19: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు లు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మ ండపంలో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షి ంచి దిశానిర్దేశం చేసారు. ఈసందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశి ంచి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య, ఉగ్రవాదు ల సమస్యలు తలెత్తి శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చాలామంది భావించారన్నారు. కానీ అందుకు భి న్నంగా తెలంగాణ పోలీసులు పని చే స్తూ అనుమానాలను పటాపంచలు చే సారన్నారు. రాష్ట్ర పోలీసులు మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఈ యేడాది రెండు ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోఉన్న 800 పో లీస్‌స్టేషనలలో ఒకేవిధమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడం మొ దటిదన్నారు. ఒక సమస్యను ఎదుర్కొంటున్నవ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కూడా ఒకే విధమైన న్యాయం జరగాలని డీజీపీ అధికారులకు సూచించారు. ప్రజల స మస్యలను స్నేహపూర్వకంగా తీ ర్చడం రెండవదన్నారు. ఈ రెండు ల క్ష్యాలను సాధించడానికి నాలుగు పద్దతులను అవలంభిస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, ప్రజల అవసరాలనుబట్టి పోలీసుల పని వి ధానంలో మార్పు తీసుకురావడం, పోలీసు శాఖలోని అన్ని స్థాయిల అధికారులు తమ నైపుణ్యం పెంచుకునే లా ప్రేరణ కల్గించాలన్నారు. పోలీసు శాఖలోని అన్ని స్థాయిల అధికారులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం వంటి పద్దతులను పాటించి పై రెండు లక్ష్యాలను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేసారు. అంతకుముందు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా పోలీసుల నేర నివారణ కోసం తీసుకుంటున్న చర్య లు, జిల్లాలో ఉపయోగిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల గురించి డీజీపీకి వివరించారు. అనంతరం మెదక్, వికారాబాద్ ఎస్పీలు చందనాదీప్తీ, అన్నపూర్ణలు ఆయా జిల్లాల్లో చేపట్టిన శాంతిభద్రత చర్యల పై వివరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు హె లిక్యాప్టర్‌లో సంగారెడ్డికి చేరుకున్న డీజీపీ, వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డిలను ఎస్పీలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమీక్షా సమావేశంలో మూడు జిల్లాల ఎఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.