మెదక్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట రూరల్, జనవరి 19: కాం గ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించి నా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపే ట మండల పరిధిలో రంగనాయకసాగర్ ఎడమ కాలువ పనులను పరిశీలి ంచిన సందర్భంగా శుక్రవారం మ ధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 60యేండ్లలో చేయలేని అభివృద్ధిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నా లుగేండ్లలో చేసి చూపిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం కోత్త చరిత్రను సృష్టిస్తుందన్నారు. పది సంవత్సరాల్లో పూర్తి కావల్సిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నెలల్లో పూర్తి చే యిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని చూసి దేశం ఆ శ్చర్యపోతుందన్నారు. కాళేశ్వరం ప్రా జెక్టును రికార్డు సమయంలో పూర్తి చే సి తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. గోదావరి జలాలతో కరువు పీడిత ప్రా ంతాల రైతుల కళ్లలో ఆనందం నింపుతామన్నారు. వచ్చే జూలై నాటికి రంగనాయకసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సిద్దిపేట ప్రాంత వాసులకు సాగునీరందిస్తామన్నారు. సిద్దిపేట ప్రాంత చెరువులు, కుంటలను నింపుతామనా నరు. రంగనాయక సాగర్ భూసేకరణ పూర్తి అయిందనీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రాజెక్టుల నిర్మాణం కోసం 18గంటలు పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా ఆనంతగిరి, సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల్లో 80శాతం భూసేకరణ పూర్తి అయ్యిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. నష్టపరిహారంతోపాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద అన్ని సదుపాయాలు క ల్పిస్తున్నామన్నారు. రైతులు కోరిన చో ట ఇండ్లు కట్టిస్తామన్నారు. భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నేతలు వేలెటి రాధాకిషన్‌శర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.