మెదక్

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 19: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రస్తుతం ఉన్న ప్రత్యేక వైద్యులు తమ లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేయాల ని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హ రీష్‌రావు సూచించారు. జిల్లా కేంద్రమై న మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, డిఎంఈ రమేష్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపా ల్ తమిల్ అరస్సు, డిఎంహెచ్‌ఓ, వై ద్యులతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ కళాశాలకు సంబంధించిన 40మంది స్ట్ఫానర్సులను నియమించే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించినట్లు తెలిపారు. అలాగే ఎంసిహెచ్ దవాఖానను మెడికల్ కళాశాలకు షిప్ట్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. వై ద్యులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. బయోమెట్రిక్ అమలుచేసి ఎ ప్పటికప్పుడు హాజరుపట్టికను మె యింటెన్ చేయాలన్నారు. వారానికోసా రి కలెక్టర్ మెడికల్ కళాశాల, ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారులతో సమీక్షిస్తారన్నారు. ఎవరైన వైద్య విధులపట్ల ని ర్లక్ష్యం వహిస్తే ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేయాలని మంత్రి సుతిమెత్తగా మందలించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఇప్పుడు మెడికల్ కళాశాలకు ప్రత్యేక వైద్య నిపుణులు తమ లక్ష్యాల ను నిర్ధేశించుకొని వైద్యవృత్తికి న్యా యం చేయాలన్నారు. ప్రతి పేషెంట్‌కు సంబంధించి ఇన్, అవుట్ వివరాలను కంప్యూటీకరణ చేయాలన్నారు.
శస్తచ్రికిత్సకు సంబంధించిన అడ్మిషన్లు పెంచాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ తమిల్ అరసు ప్రతిరోజు వైద్య సిబ్బంది, విద్యార్థులతో సమీక్షించాలని ఆదేశాలు జారీచేశారు. తాను, జిల్లా క లెక్టర్ వెంకట్రాంరెడ్డి వారంలో ఒక రో జు అకస్మీక తనిఖీలు చేపడతామనా నరు. వైద్యులు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలన్నారు. ఎంసిఏ నిబంధనల ప్రకారం లోటుపా ట్లు సవరించుకొని వారంలోగా సరిదిద్ధుకోవాలన్నారు. సెప్టెంబర్ లోపు డా క్టర్లు, వైద్య సిబ్బందికి అడ్మినిస్టేట్ కా వర్టర్స్ పూర్తిచేయాలని వైద్య ఇంజనీరి ంగ్ అధికారులను ఆదేశించారు. డిఎ ంఈ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 15లోపు ఆపరేషన్ థియోటర్ సిద్ధం చేయడంతోపాటు కొత్త థియోటర్‌లో శస్తచ్రికిత్సలు నిర్వహిస్తామన్నారు. ఇం దుకు సంబంధించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి చెప్పారు. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి మాట్లాడు తూ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. సమీక్షలో డిఎంహెచ్‌ఓ అమర్‌సింగ్, సూపరిం టెండెంట్ నర్సింహ్మా, వైద్యులు కాశీనాథ్, వైద్య కళాశాల ప్రోఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

సింగూర్ జలాల తరలింపుపై వాగ్వాదం

సంగారెడ్డి, జనవరి 19: ఇటీవల సిం గూర్ జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు తరలించడంపై జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసిం ది. సమావేశం ప్రారంభం కాగానే నా రాయణఖేడ్ ఎంపిపి అధ్యక్షులు పి. సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ సింగూర్ జ లాలను ఎస్‌ఆర్‌ఎస్పీకి ఎందుకు తరలి ంచారని అధికారులను నిలదీసారు. దీ ంతో కల్పించుకున్న మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు సింగూర్ నీటిపై ప్రశ్ని ంచే హక్కు ఎక్కడదంటూ ఎద్దేవా చే సారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ఏం చేసారని ఎదురుదాడికి దిగడంతో ఆ గ్రహం వ్యక్తం చేసిన సంజీవరెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జి ల్లాకు చెందిన సమస్యలపై ప్రశ్నిస్తే పార్టీల పేరు ప్రస్తావిస్తూ రాజకీయం చేస్తారా అన్నారు. అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ కల్పించుకుని నారాయణఖేడ్ ఎంపీపీ అధ్యక్షులకు సింగూర్ నీటి గురించి ఎందుకు మాట్లాడుతారని, ఆ ప్రాంతానికి చెందిన నల్లవాగు ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవాలని హితవుపలికారు. దీంతో కాంగ్రెస్ జడ్పీటీసీలు బాబుమోహన్‌ను నిలదీసారు. వివాదం పెద్దది కాకుండా మధ్యలో కల్పించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సింగూర్ నీటిని ఈ ఒక్కసారికే ఎస్‌ఆర్‌ఎస్పీకి త రలించామని, ప్రతిసారి ఉండదని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కా ళేశ్వరం నుండి గోదావరి జలాలను తీ సుకువచ్చి సింగూర్ ప్రాజెక్టును నింపుకుని రైతులకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కల్హేర్ జడ్పీటీసీ సభ్యురాలు సప్న మాట్లాడుతూ మండలంలో ఆర్‌ఓ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయించానని, అ ందుకు సంబంధించిన బిల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ సంతకం పెట్టడం లేదని, ఈవిషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వేణుమాదవ్‌కు ఫోన్ చేసి వివరి ంచే ప్రయత్నం చేయగా నోరు మూ సుకో అంటూ బోరున విలపిస్తూ డి ప్యూటి స్పీకర్‌తో గోడు వెళ్లబోసుకు ంది. ఈవిషయంపై ఇక్కడ చర్చ వద్దని తరువాత మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని పద్మా దేవేందర్‌రెడ్డి హామి ఇ వ్వడంతో జడ్పీటీసీ శాంతించింది.

జాతీయస్థాయి పోటీలు నిర్వహణ భేష్
* రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు

సిద్దిపేట, డిసెంబర్ 19 : ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌లో క్రీడాకారులు భారతదేశ ప్రతిష్ట ఇనుమడింప చేసేలా పతకాలు గెలుచుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించుకోవటం ఎంతో సంతోషం కల్గించిందన్నారు. తెలంగాణ సర్కార్ క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కలిస్తుందని మంత్రి హరీష్‌రావు స్పష్ట ం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో జరిగిన 40వ హ్యాండ్‌బాల్ పోటీల్లో 2వ రోజు గెమ్స్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా క్రీడకారులను పరిచయం చేసుకొని..వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, దేశంలో 29 రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అలాగే సిద్దిపేట జిల్లా సైతం కొత్తగా ఏర్పడిందన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాల నుండి 31 జట్లు పాలుపంచుకోవటం హ్యాండ్ బాల్ చరిత్రలోనే తొలిసారి కావటం తనకు ఏంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థులు క్రీడ స్ఫూర్తిని కొనసాగించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తాను చాటాలని ఆకాంక్షించారు. సిద్దిపేటలోని స్టేడియాన్ని అన్ని సదుపాయాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుకున్నట్లు తెలిపారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో రంజీట్రోపీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో క్రీడకారుల వసతి కోసం టూరిజం శాఖ ఆధ్వర్యంలో త్రీస్టార్ హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న క్రీడపోటీల్లో వసతుల కల్పనలో ఏవైన లోటు పాట్లు ఉంటే పెద్దమనస్సుతో సర్దుకుపోవాలని కోరా రు. ఇండియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ కార్యదర్శి ఆనందేశ్వర్‌పాండే, కోశాధికారి ప్రితిపాల్‌సింగ్, కోచ్ శివాజీ షిండే, రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, జిల్లా అసొసియేషన్ కార్యదర్శి మల్లేశం, రాధకిషన్‌శర్మ, బర్లమల్లికార్జున్, కలకుంట్ల మల్లికార్జున్, విజయ్, రవీందర్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.