మెదక్

చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 20: గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మహేందర్ పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్, తొగుట, గౌరారం, బేగంపేట, కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌ల పరిదిలో రైతులు నిల్వ చేసిన ధాన్యం నిల్వలను గత 20 రోజులు గా నిందితులు దేవదాసు, గడ్డం ఎల్లంలు దొంగిలిస్తూ తూప్రాన్‌కు చెందిన ఉప్పల రాములు అనే వ్యాపారికి విక్రయిస్తూ వస్తున్నారు. అయితే జల్సాల కు అలవాటు పడిన నిందితులు దొంగతనాలకు పాల్పడుతుండగా, దాన్యం కొనుగోలు చేసిన ఉప్పల రాములును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. అయితే మరో నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నట్లు ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు. కాగా కొల్గూరుకు చెందిన జీడిపల్లి రవీందర్‌రెడ్డికి చెందిన 17 బస్తాల దాన్యం, గజ్వేల్‌లోని శ్రీ లక్ష్మి నర్సింహ రైస్‌మిల్లు వద్ద 40 బస్తాల దాన్యం, మజీద్‌పల్లి సాయిబాబా రైస్‌మిల్లు వద్ద 62 బస్తాల దాన్యం, చిన్నకిష్టాపూర్ లక్ష్మినర్సింహా రైస్‌మిల్లు వద్ద 26 బస్తాల దాన్యం, బేగంపేట బాలాజి రైస్‌మిల్లు వద్ద 28 బస్తాల దాన్యం నిందితులు దొంగిలించగా, వాటి విలువ రూ. లక్ష 63 వేలు ఉంటుందని తెలిపారు. కాగా నిందితుల నుండి రూ. లక్షా 10వేలు స్వాదీనం చేసుకున్నట్లు ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు. అయితే గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఏటీఎం కేంద్రాల వద్ద మాయమాటలు చెప్పి నగదు దోచుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులతో సంబందాలు పెట్టుకోవద్దని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సీఐ ప్రసాద్, ఎస్‌ఐ కమలాకర్, ఐడీపార్టీ సిబ్బంది రాంచంద్రారెడ్డి, అశోక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.