మెదక్

జ్ఞాపక శక్తి పోటీల్లో చరిష్మాకు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 20: గత నెల చైనాలో జరిగిన జ్ఞాపకశక్తి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ అవార్డు పొందిన నిత్యసాయి చరిష్మాను శని వారం ఘనంగా సన్మానించారు. సిటిజన్ ఫోరం, గాయత్రి పరివార్ ఆధ్వర్యం లో పట్టణంలోని ఎస్‌ఎస్‌కె భవన్‌లో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపకశక్తిపై అవగాహాన సదస్సు నిర్వహించారు. డిసెంబర్-2017లో చైనాలో జరిగిన జ్ఞాపకశక్తి పోటీల్లో 140 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన చరిష్మా ఇంటర్‌నేషనల్ గ్రాండ్ మెమోరియల్ అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డును ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్, మున్సిపల్ చైర్ పర్స్‌న్ విజయలక్ష్మి, ఎంఈఓ వెంకటనర్సింలు, యువజన సంఘాల అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణలు హాజరై మాట్లాడారు. విద్యార్థులు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లపై ఆధారపడకుండా తమ సొంత మేధాశక్తిని ఉపయోగించుకోవాలని సూచించారు. చిన్నారి చరిష్మా భారతదేశానికే గుర్తింపు తెచ్చిందని అభినందించారు. కార్యక్రమంలో సిటిజన్ ఫోరం జిల్లా కోఆర్డినేటర్ దత్తత్రేయ చౌహాన్, మహేందర్ చౌహాన్, సత్యనారాయణ చౌహాన్, లింగాగౌడ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.