మెదక్

వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో నేడు వసంతపంచమి మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 21: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో ఈ నెల 22వ తేదీన వసంత పంచమి మహోత్సవం(శ్రీపంచమి) జరుగనుంది. కాగా ఎతె్తైన కొండలు, ఆహ్లాదకర వాతావరనంలో వెలసిన శ్రీ విద్యాధరి అమ్మవారు భక్తుల ఎలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ది చెందింది. కంచిపీఠం ఆద్వర్యంలో ఆలయ నిర్వాహన కొనసాగుతుండగా, కంచి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర, విజయేంద్ర సరస్వతులు హాజరయ్యే అవకాశముంది. ఇందుకోసం ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి కాగా లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశమున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీ విద్యాధరి క్షేత్రంతో పాటు శ్రీ లక్ష్మి గణపతి, శ్రీ శనైశ్చర ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, తదితర జిల్లాల నుండి భక్తులు ఆదివారం రాత్రి నుండే ఆలయానికి తరలిరావడం కనిపించింది. భక్తులు, పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సర్వం సిద్దం చేసినట్లు చంద్రశేఖరశర్మ పేర్కొన్నారు.

కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శన
* 295 మందితో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక * పరిశీలించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు
పటన్‌చెరు, జనవరి 21: ఆదివారం పట్టణంలోని మైత్రి మైదానంలో కరాటే గిన్సిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శన జరిగింది.. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనగా నిర్వహించారు. యూనివర్సల్ షోటోకన్ మార్షల్ ఆర్ట్ ఆర్గనైజేన్ ఇండియా అధ్వర్యంలో మైత్రి మైదానంలో ఈ ప్రదర్శన జరిగింది. గిన్సిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి మాస్టర్ జయంతిరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి 295 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇచ్చిన లక్ష్యం ప్రకారం 30 నిమిషాలలో 2.95 లక్షల ఫుల్ కాంటాక్ట్ కిక్స్ క్రీడాకారులు అటెమ్ట్ చేసారు. ఇలాంటి ప్రదర్శనను ఇప్పటి వరకు 50 నుండి వంద మంది క్రీడాకారులు మాత్రమే చేసారని గిన్సిస్ వరల్డ్ రికార్డు తరపున ప్రతినిధులు స్పష్టం చేసారు. ఈ ప్రదర్శనలో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తరపున ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఆదివారం జరిగిన కరాటే అటెమ్ట్‌ను పరిశీలన నిమిత్తం గిన్నిస్ వరల్డ్ రికార్డుకు పంపిస్తామని ప్రతినిధి జయంతిరెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం ఎంపిపి నాలకంటి యాదగిరియాదవ్, పటన్‌చెరు ఎంపిపి శ్రీశైలంయాదవ్, తెలంగాణ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, నియోజకవర్గ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బూరుగడ్డ పుష్పనాగేష్‌యాదవ్, కార్మికనాయకుడు నర్రా భిక్షపతి పాల్గోన్నారు.