మెదక్

ఘనంగా మల్లిఖార్జునుడి కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జనవరి 21: వేద మంత్రోచ్ఛారణలు...్భక్తుల జయజయధ్వనాల మధ్య మంబోజిపల్లి శ్రీ మల్లిఖార్జునస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మండలంలోని మంబోజిపల్లిలో మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ మల్లిఖార్జునస్వామి ఆలయం వద్ద మూడు రోజుల ఉత్సవాలకు ఆదివారం తెల్లవారుజామున అంకురార్పణ గావించారు. ఆలయ వంశానుగత ధర్మకర్త మల్లన్నస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించారు. మద్యాహ్నాం మల్లిఖార్జునస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లోకకళ్యాణార్దం నిర్వహించే కళ్యాణోత్సవ మంగళసూత్రాలను భక్తులకు చూయించి క్రతువు నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు ఓడిబియ్యం పోశారు. మల్లన్నస్వామి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పెద్దయెత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, మెదక్, మాచవరం, మంబోజిపల్లి, పేరూర్, ర్యాలమడుగు, రాంపూర్, కిష్టాపూర్ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.

సేవాలాల్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలి
* ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన జాగో బంజార
సదాశివపేట, జనవరి 21: పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని, అదే విధంగా బంజార భవన నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించాలని జాగో బంజార సేవా సంఘం సభ్యులు ఆదివారం నాడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం లేకపోవడం, స్థలం కూడా లేకపోవడంతో ప్రతి సంవత్సరం మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించుకుంటున్నామని సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇందుకుగాను తమ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మందిరాన్ని నిర్మించుకుని ప్రశాంత వాతావరణంలో పూజించుకునేందుకు మందిర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. బంజార భవనం లేకపోవడంతో సంఘ సమావేశం, చిన్న చిన్న శుభకార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బంజార భవనం నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జాగో బంజార్ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు పురాన్‌సింగ్, ప్రధాన కార్యదర్శి గంగ్‌శెట్టి, కోశాధికారి జైసింగ్, సభ్యుడు పవార్ పవన్ తదితరులు పాల్గొన్నారు.