మెదక్

కిక్కుతో వాహనం నడుపుతూ 28 మంది బుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 21: మందు కొట్టి వాహనాలను నడుపుతున్న చోదకులపై సంగారెడ్డి జిల్లా పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉండే 65 నంబరు జాతీయ రహదారిపై ఈ సారి జిల్లా పోలీసులు గురి పెట్టారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులో ఉన్న టోల్ ఫ్లాజా వద్ద సంగారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడున్నర గంటల వ్యవధిలోనే ఒకరు కాదు ఇద్దరు 28 మంది మద్య మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. ఈ తనిఖీల్లో తెలంగాణ రాష్ట్ర వాసులతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహన చోదకులు కూడా ఉండటం గమనార్హం. రాత్రి సమయం కావడం, పోలీసులు తనిఖీలు చేస్తున్న సమాచారం లేకపోవడం, టోల్ ఫ్లాజా వద్ద ఎప్పుడు వాహనాలు టోల్ బిల్లు చెల్లించడానికి నిల్చొని ఉంటాయనే బ్రమలతో యదేచ్చగా వాహనాలను నడుపుకుంటూ వచ్చిన వారి నోట్లలో శ్వాస పరికరాన్ని చొప్పి మరీ తనిఖీలు చేసారు. ఈ తనిఖీల్లో 9 మంది ద్విచక్ర వాహన చోదకులు ఉండగా, 8 మంది కారు డ్రైవింగ్ చేస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌పోర్టులకు సరకులు చేర వేసే లారీ డ్రైవర్లు, అత్యధికంగా ప్రమాదాల భారీన పడే 5 ఆటోలు ఉండటం విశేషం. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలను నడిపిన వారిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కోర్టుకు సెలవు ఉండటంతో సోమవారం నాడు పట్టుబడిన మందుబాబులను కోర్టులో హాజరు పర్చే అవకాశం ఉంది. సంగారెడ్డి ఏడీఎం కోర్టు మేజిస్ట్రేట్ దేవిమానస మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిపై ఏ మాత్రం ఉపేక్షించకుండా జైలుకే పంపిస్తున్నారు. ఈ విషయమై డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ జాతీయ రహదారితో పాటు డివిజన్ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో వివిధ కూడళ్లలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోవడమో, ఇతర ప్రాణాలు పోవడానికి కారణమో కావద్దని డీఎస్పీ హితవుపలికారు. మందు మత్తులో వాహనాలను నడిపే వారిపై భారీ మొత్తంలో జరిమానాలు విధించడమే కాకుండా జైలు శిక్షలు పడేలా చూస్తామని, మళ్లీ మళ్లీ పట్టుబడితే లైసెన్సులు కూడా రద్దు చేస్తామన్నారు.
ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్, రూరల్ సీఐలు రామకృష్ణారెడ్డి, నరేందర్, సదాశివపేట సిఐ కె.సురేంద్‌రెడ్డి, కొండాపూర్ సీఐ రవితో పాటు ఎస్‌ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

మాచవరం దొంగల అరెస్టు
* ఇద్దరు దొంగల నుండి 8 తులాల బంగారం రికవరీ * డీఎస్‌పి వెంకటేశ్వర్లు వెల్లడి
మెదక్ రూరల్, జనవరి 21: జిల్లా కలెక్టర్, ఎస్‌పిలు నివాసముండే మాచవరంలో నాలుగిళ్లలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను మెదక్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 8 తులాల బంగారం, 10 తులాల వెండి గొలుసులు రికవరి చేసి ఆదివారం అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్‌పి వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. గత నవంబర్ 24న ఒకే రోజురాత్రి మాచవరంలోతాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన వారిలో కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన దుబ్బగల్ల క్రిష్ణ, వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన వెనె్నల వెంకటిలున్నారు. దుబ్బగల్ల క్రిష్ణ ఇదివరకు గతంలో మెదక్, నర్సాపూర్‌లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. ఇతనిపై మూడు వారెంట్లున్నాయి. తాగుడు అలవాటుపడి తరచు తాళంవేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌చేసి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. కూలీ పని వద్ద స్నేహం కుదిరిన వెంకటిని సైతం దొంగగా మార్చాడు. నవంబర్ 24న రాత్రి మంబోజిపల్లి వద్ద ఇద్దరు కలుసుకుని మాచవరంలో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అనంతరం క్రిష్ణ డిసెంబర్ 12న కోరుట్ల, 25న గుమ్లాపూర్, 26న చల్గల్‌లో రెండు దొంగతనాలు, 30న బుగ్గారంలో రెండు దొంగతనాలకు పాల్పడగా అక్కడి పోలీస్టేషన్‌లలో కేసులు నమోదుచేశారు. కాగా నేటి ఉదయం 7 గంటల ప్రాంతంలో క్రిష్ణ మోటర్‌సైకిల్‌పై పోవుచుండగా అవుసులపల్లి గ్రామ శివారులోని తీన్ నెంబర్ చౌరస్తా వద్ద మెదక్ రూరల్ పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు ఒప్పుకున్నాడు. వారి నుండి 8 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు రికవరి చేశారు. నగదు సొత్తు ఖర్చు చేసినట్లు అంగీకరించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డిఎస్‌పి వెంకటేశ్వర్లు వివరించారు. కేసు చేదించిన రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్‌ఐలు లింబాద్రి, శ్రీకాంత్, ఎఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ తాహేర్, హోంగార్డు లక్ష్మణ్‌లను అభినందించారు.

హోరాహోరీగా కొనసాగుతున్న ఉద్యోగుల క్రీడలు
* డిపార్ట్‌మెంట్‌ల వారీగా పోటీ పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు * గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతుల ప్రదానం * టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌రావు
మెదక్, జనవరి 21: గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగుల క్రీడోత్సవాలు టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మొదటి రోజున ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం క్రీడలు టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడలు ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నాయి. అగ్రికల్చరర్ వర్సెస్ డీఆర్‌డీఎ ఆధ్వర్యంలో కబడ్డీ పోటిలు ఆసక్తికరంగా కొనసాగాయి. క్రికెట్‌లో రెవెన్యూ ఉద్యోగులు సెమీ ఫైనల్‌లో విజయం సాధించారు. మహిళా విభాగంలో త్రోబాల్ క్రీడలు కొనసాగుతున్నాయి. టీఎన్‌జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్యామ్‌రావు, నరేందర్‌లు క్రీడలను ప్రారంభించారు. శనివారం నుండి మూడు రోజుల పాటు కొనసాగనున్న జిల్లా క్రీడోత్సవాల్లో హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేవారు. ఈ హెల్త్ క్యాంప్‌లో సూపర్‌వైజర్ మదన్‌మోహన్, సిస్టర్లు పావని, రోజిలిన్, మంజుల, సంగ శ్రీను, రాజ్‌కుమార్‌లు ఉన్నారు. పీఈటీలు సుధాకర్, గోపాల్, కిరణ్, దేవేందర్, వినోద్, మధు, ఫిజికల్ డైరెక్టర్లు సత్యరావు, శ్రీ్ధర్‌రెడ్డి, ప్రతాప్‌సింగ్‌లు ఈ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా క్రీడోత్సవాల్లో ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు స్పోర్ట్‌మెన్‌గా గతంలో వ్యవహరించిన తీరును ఈ క్రీడలలో వాలిబాల్‌లో అత్యంత ప్రతిభ కనబరిచారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి క్రీడలను ప్రారంభించడమే కాకుండా అత్యంత ఉత్సహంతో క్రీడలలో పాల్గొని ఆమె ప్రతిభను కనబరిచారు. ఇరిగేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనాగరాజు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నగేష్, ఆర్డీఓ మెంచు నగేష్, సోషల్ వెల్ఫేర్ అధికారులు, ఎస్టీ వెల్ఫేర్ అధికారి కోటాజీ వంటి అధికారులు భారీయేత్తున పాల్గొని ఈ క్రీడలను విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు. సోమవారం నాటికి ఈ క్రీడలు ముగుస్తాయి.
ఇందులో గెలుపొందిన విజేతలను కూడా ప్రకటించనున్నారు. గెలుపొందిన విజేతలు ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులు అందుకోబోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో అన్ని రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగానే టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ప్రభుత్వ అధికారుల క్రీడోత్సవాలు చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపిన విషయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి
సదాశివపేట, జనవరి 21: నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యవర్గం ఆదివారం నాడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను కలిసి సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.
బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవాచారి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులంతా సదాశివపేటకు వెళ్లి ఎమ్మెల్యేను సన్మానించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బ్రాహ్మణ సంఘానికి స్వంత భవనం లేదని, భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలా చొరవ చూపించాలని ఈ సందర్భంగా కోరారు. అదే విధంగా బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు మనోహర్‌శర్మ, ప్రధాన కార్యదర్శి రామారావు దేశ్‌పాండే, గౌరవ అధ్యక్షులు సర్వోత్తమ శర్మ, కొండాపూర్ ఎంపీపీ మాజీ అధ్యక్షులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, మునిపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు రాంచందర్‌రావు దేశ్‌పాండే, సంగారెడ్డి తాలుకా అధ్యక్షులు రమేష్‌రావు, పటాన్‌చెరు అధ్యక్షులు వాసుదేవరావు, సదాశివపేట తాలుకా అధ్యక్షులు నరసింహారావు, సంఘం నాయకులు వినోద పాటిల్, కిషన్‌రావు, గోపాల్‌రావు, సత్యనారాయణరావు, రాజేశ్వర్‌రావు, విశ్వనాథశర్మ, నరేష్ దేశ్‌పాండే, రాజేశ్వర్‌రావు కులకర్ణి, సత్యనారాయణరావు కులకర్ణి, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు ప్రభావతి జ్యోషి, సంగారెడ్డి తాలుకా మహిళా అధ్యక్షురాలు కరణం మాదవి తదితరులు పాల్గొన్నారు.