మెదక్

మూఢ నమ్మకాలు.. అపసవ్య మార్గాలు విడిచి ప్రగతి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 23: ఈరాచకొండలో ఉన్న గిరిజనుల పిల్లలే రేపటి ఉన్నత అధికారులుగా ఎదుగుతారని తెలంగాణ అడిషనల్ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ పరిధిలోని రామాలయం వద్ద మంగళవారం చౌటుప్పల్ పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో గిరిజనుల అవగాహనా సమావేశం నిర్వహించారు. గిరిజనుల కోసం రాచకొండ ప్రక్కనే ఉన్న తిప్పాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌ను ప్రారంభించారు. మూఢనమ్మకాలపై పాటలు, ఆటల రూపంలో ప్రదర్శించారు. గిరిజన విద్యార్థులకు నోట్‌బుక్కులు, పలకలు, బ్యాగులు అందజేశారు. యాదాద్రిభువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ దేశంలోనే రాచకొండ అతిపెద్ద కమిషనరేట్‌గా పేరుగాంచిందన్నారు. వేగంగా ఈప్రాంతం అభివృద్ధి చెందుతున్నదన్నారు. అందుకే రాచకొండ కమీషనరేట్ పేరు పెట్టుకున్నందుకు ఇక్కడి ప్రాంతంపై ఎక్కువ ప్రేమ, అభిమానం చూపిస్తున్నాడన్నారు. ఈగిరిజనుల పిల్లలను భవిష్యత్తులో ఉన్నతాధికారులుగా, ప్రజాప్రతినిధులుగా తయారు చేయడానికి ఇప్పటి నుంచే కృషిచేస్తున్నాడని తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖలను కలుపుకుని గోల్డెన్ టీంగా సీపీ భగవత్ పనిచేస్తున్నాడని కొనియాడారు. అమాయక గిరిజనులు మూడనమ్మకాలతో నష్టపోతున్నారని, వారంతా చదువుకుంటే విజ్ఞానం పెంచుకుంటారని తెలిపారు. రాచకొండలో ఇలాంటి సమావేశాలు నిర్వహించి గిరిజనుల్లో వెలుగులు నింపుతున్న కమిషనర్‌ను అభినందించారు.
మా కమిషనరేట్‌కు రాజధాని రాచకొండ
రాచకొండ పోలీస్ కమీషనరేట్‌కు రాజధాని రాజులేలిన ఈరాచకొండేనని కమీషనర్ మహేశ్ ఎం. భగవత్ అన్నారు. ఈప్రాంత గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే ధ్యేయంగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఇదే రామాలయం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు చెప్పిన కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. జయం మనదే అనే పథకం క్రింద 1200 మంది నిరుద్యోగులకు 4సెంటర్ల ద్వారా ఉచితంగా పోలీస్, ఫారెస్ట్, పంచాయతీరాజ్‌తో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాలకోసం 4నెలల పాటు శిక్షణను ఇప్పించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువకులు కొంత కష్టపడితే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చునన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో 26వేల ఉద్యోగాలు నింపుతామన్నారు.
రాచకొండకు సాగునీరందిస్తాం: ఎమ్మెల్సీ కర్నె
చర్లగూడెం ప్రాజెక్టు ద్వారా ఈప్రాంతంతో పాటు రాచకొండలోని భూములకు సాగునీరు వస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సాగునీరు వస్తే ప్రతి ఒక్కరికి పనులు లభిస్తాయని, పంటలు సంపూర్ణంగా పండుతాయన్నారు. రాజకీయాలకతీతంగా ఈప్రాంతాన్ని అభివృద్ధి పర్చడానికి తనవంతుగా రోడ్లు, నీటి ట్యాంకులు, బస్‌షెల్టర్‌లు నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వ భూములను నమ్ముకుని చాలా మంది పేదలు జీవిస్తున్నారని వారికి న్యాయం చేయడానికి రెవెన్యూ అధికారులు సహకరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ రామచందర్‌రావు, ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ ఎసీపీ రమేశ్‌నాయుడు, ఆర్డీవో సూరజ్‌కుమార్, చౌటుప్పల్ సీఐ ఏరుకొండ వెంకటయ్య, ఎంపీపీ వాంకుడోతు బుజ్జీనాయక్, జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, తహశీల్దార్ శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు.
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

తుర్కపల్లి, జనవరి 23: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని మోతీరాం తండాలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మోతీరాం తండాకు చెందిన బానోతు సంతోష్(30) తన వ్యవసాయ భూమిలో నాలుగు బోర్లు వేయగా నీళ్లు రాకపోవడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపంతో సోమవారం రాత్రి పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున తండావాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమ్తితం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని సర్పంచ్ లక్ష్మి కోరారు.