మెదక్

జడ్పీ స్థాయి సంఘంలో ఉపాధి నిధుల రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 23: పంచాయితీ రాజ్ ద్వారా గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణాలకు మంజూరైన జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను జడ్పీటీసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లకు కేటాయించని పక్షంలో ఆందోళనకు దిగుతామని జిల్లా పరిషత్ ఒకటవ, ఏడవ స్థాయి ఆర్ధిక, పనుల సంఘం హెచ్చరించింది. మంగళవారం చైర్మన్ ఎన్. బాలునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయితీరాజ్‌కు నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు కోట్ల చొప్పున ఉపాధి హామీ నిధులు సిసి రోడ్ల కోసం మంజూరైనట్లుగా ఆ శాఖ అధికారులు వెల్లడించారు. వెంటనే జడ్పీటీసిలు మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, జాజుల అంజయ్య, నర్సింగ్ శ్రీనివాస్‌లు సదరు నిధుల కేటాయింపు తీరును ప్రశ్నిస్తు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఉన్నందునా ఉపాధి నిధులను వారికి కేటాయించడం సరికాదంటు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో సర్పంచ్, ఎంపిపి, జడ్పీటీసిలకు ఉపాధి నిధులు కేటాయించడం జరిగిందని అదే పద్ధతిలో కనీసంగా 25లక్షల చొప్పున తమకు కేటాయింపులు చేయాలని పట్టుబట్టారు. పంచాయితీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల తీర్మానాలు లేకుండా ఉపాధి హామీ నిధుల ఖర్చు, చెల్లింపులు సాగనుందునా స్థానిక ప్రజాప్రతినిధులకు నిధుల కేటాయింపులు చేయకపోతే వచ్చే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సాగనివ్వకుండా ఆందోళనకు దిగుతామంటు స్పష్టం చేశారు. సభ్యుల ఆందోళనతో ఏకీభవించిన జడ్పీ చైర్మన్ బాలునాయక్ వారి డిమాండ్ మేరకు ఉపాధి హామీ నిధులు స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయించాల్సిందేనంటు అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై అవసరమైతే జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో చర్చిస్తామన్నారు. సమస్యపై స్పష్టత రాకపోతే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆందోళన తప్పదన్నారు. అంతకుముందు సభ్యులు మాట్లాడుతు ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్ రోడ్లు, వంతెనల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటు అధికారులను డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ నాల్గవ విడత పనులకు ప్రతిపాధనల వివరాలు ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ హామీద్‌ఖాన్ సభ్యులకు వివరించారు. మొదటి మూడు విడతల్లో అసంపూర్తి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. అనంతరం చైర్ పర్సన్ చింతల వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహిళా, శిశుసంక్షేమశాఖ ఐదవ స్థాయి సంఘం సమావేశంలో సభ్యులు మాట్లాడుతు అంగన్‌వాడీ కేంద్రాల సమస్యలు, ఆసరా పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానంతో ఎదురవుతున్న ఇబ్బందులులపై చర్చించారు. శిశువిక్రయాలు, మరణాల నివారణకు జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాలంటు కోరారు. ఈ స్థాయి సంఘాల సమావేశాల్లో సభ్యులు పెద్దిటి బుచ్చిరెడ్డి, శంకర్‌నాయక్, సిఈవో హనుమానాయక్, డిఆర్‌డిఏ పిడి వెంకట్రావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.