మెదక్

వైద్యం వికటించి రోగి మరణించాడంటూ రాస్తారోకో, ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జనవరి 23: మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం వేంకటేశ్వర నర్సింగ్‌హోంలో మంగళవారం మద్యాహ్నం వైద్యానికి వచ్చిన రోగి ఏ.సైదులు (50) వైద్యుడి నిర్లక్ష్య చికిత్స వల్ల మరణించాడంటూ బంధువులు, పార్టీల నాయకులు స్థానిక అంబేద్కర్ రోడ్డుపై రాస్తారోకో, ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన అవిరెండ్ల సైదులు (50) అనారోగ్యానికి గురై ఆసుపత్రికి రాగా డాక్టర్ శరత్‌బాబు ఇంజక్షన్ చేశారన్నారు. ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికే సైదులు మరణించాడని బంధువులు ఆరోపించారు. వైద్యుని నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ వస్కుల మట్టయ్య, ఎమ్మార్పీఏస్ నాయకులు మొండికత్తి లింగయ్య బంధువులు రాస్తారోకో, అనంతరం ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. వెంటనే టూటౌన్ పోలీసు ఇన్స్‌పెక్టర్ బి.సాయిఈశ్వర్‌గౌడ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్వవేక్షించారు. అనంతరం మృతుడి తరఫున బంధువులు, పార్టీల నాయకులు వైద్యునితో చర్చలు జరిపారు. పరిహారంగా 2 లక్షల రూపాయలు ఇస్తామనడంతో ఆందోళన సద్దుమణిగింది.