మెదక్

2న అవినీతి వ్యతిరేకత, కుల రహిత సమాజంగా ఉండే పార్టీని ఏర్పాటు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ పట్టిష్టంగాలేదని దీంతో ఎటూ చూసిన అవినీతి రాజ్యం కనీ పిస్తుందని పేదల సంక్షేమం మరిచి దోపిడి దారులకు అండగా రాజకీయ పార్టీలు నడుచుకుంటున్నాయని అలాంటి పార్టీలకు వ్యతిరేకంగా అవినీతి లేని రాజకీయ పార్టీగా త్వరలో ఈనెల 25కల్లా విధి విధాలను రుపొదించి వచ్చే నెల మార్చి 2న పార్టీ పేరు ప్రకటిస్తామని సామాజిక తెలంగాణ న్యాయ జె ఏసీ చైర్మెన్ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ న్యాయ మూర్తి చంద్రకుమార్ వెల్లడించారు. మంగళవారంనాడు ఖేడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికారంలో పాలించిన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టిడిపి, ప్రస్తుతం అధికారంలో టి అర్ ఎస్ పార్టీ సైతం అవినీతి పరులకు అండగా నిలుస్తుందని అందుకే ఎటు చూసిన అవినీతి అధికారులే దర్శనం ఇస్తున్నారని దీంతో పేదలకు ఆన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంత్‌చారి వారి కుటుంబీకులు ఏటు ఉన్నారో కానీ దోడ్డి దారిని పార్టీలో ఉంటున్న దోపిడి దారులు పాలకులుగా ఎదుగుతున్నారని ఇది ఎంత వరకు న్యాయమని అయన ప్రశ్నించారు. త్యాగాలు చేసింది ఒకరైతే బోగ్యా బాగ్యలు పోందుతున్నా వారు మరోక్కరని అయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకుగాను కుల రహిత సమాజం, కుల వివక్షత సమాజం అందరు సమానులే నినాదాంతో అవినితిలేని పార్టీని స్థాపించాలని ప్రణాళిక రుపొందిస్తున్నామని తెలిపారు. పేదలకు కార్పొరేట్ కాలేజిలో విద్యను నేర్చుకునే వారు ఎవరు అని ప్రశ్నిస్తే దోపిడి దారులు పెట్టు బడి దారులు కుమారులు రాజకీయ నాయకుల కుమారులు ఎంపి ఎమ్మెల్యేలు కుమారులే చదువుకుంటారని పేదలకు ఏ ఒక సిటు లభించదని అయన తెలిపారు. పేదలంత ఒకటై సామాజిక తెలంగాణ కోసం ఐక్యం కావాలని పిలుపు నిచ్చారు. నిరుద్యోగులు యువకులు యువతిలు అవినీతిలేని రాజకీయ పార్టీకి మద్దతు పలుకాలన్నారు. ఇందులో సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివగౌడ్, ముఖ్మకార్యదర్శి దాత్రిదర్మారవిందర్, యువకులు పాల్గొన్నారు.

10 రోజుల ఆందోళనకు తెర
- మామిడ్యాల, బహిలింపూర్ గ్రామస్థులతో ఆర్డీఓ మంతనాలు -
ములుగు, ఫిబ్రవరి 20: కొండపోచమ్మ జలాశయ ముంపు గ్రామాలైన బహిలింపూర్, మామిడ్యాల, తానెదార్‌పల్లి గ్రామస్తులు గత 10 రోజులుగా జలాశయ పనులకు ఆటంకం కల్పిస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం గజ్వేల్ ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, ములుగు తహసీల్దార్ నాగమణితో కలిసి బహిలింపూర్, మామిడ్యాల గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి గ్రామస్తులకున్న అనుమానాలను ఆర్డీఓ సామరస్యంగా విని సమస్యలు పరిష్కారం చేసుకుంటే సానుకూల వాతావరనం నెలకొని ఈ సమస్యలకు ఫలితాలిస్తాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేందుకు కలెక్టర్‌తో సహా అందరు అధికారులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తున్కిబొల్లారం గ్రామంలో నిర్మించే 2 పడక గదుల నిర్మాణం కోసం వారం రోజుల్లో ముఖ్యమంత్రిచే శంఖుస్థాపన చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వాటి నిర్మాణం కోసం కూలీలను ఇతర రాష్ట్రాల నుండి రప్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక మిగిలిన కొన్ని చిన్నచిన్న సమస్యలకు తొందరలోనే పరిష్కారమయ్యే విదంగా ముంపు గ్రామాలైన ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు చొప్పున ముగ్గురు ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బందితో కలిసి 3 విభాగాలుగా ఏర్పడి అన్నింటిని రికార్డు చేసుకొని అందరికి న్యాయం జరిగే విదంగా కృషి చేస్తామన్నారు. దీంతో ఏకీభవించిన గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో గౌరారం సీఐ శివలింగం, ఎంపీపీ వెంకట్‌రాంరెడ్డి, ములుగు, గౌరారం ఎస్‌ఐలు శ్రీశైలం, ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 20: ఎస్‌టీయు ఆధ్వర్యంలో ఈనెల 21న ప్రపంప మాతృ భాష దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారావు, పట్నం భూపాల్‌లు తెలిపారు.
జిల్లాకు చెందిన మాతృ భాష పండితులు, సాహితీ వెత్తలు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.