మెదక్

అక్రమ లేఔట్లకు పాల్పడిన వారిపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 20: అక్రమ లెఅవుట్ నిర్మాణాలకు పాల్పడిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకంటామని సిద్దిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ, పట్టణ ప్రణాళిక అధికారి నరహారి హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సిద్దిపేట, చేర్యాల, చిన్నకోడూరు, గజ్వేల్, వర్గల్,జగదేవ్‌పూర్, నంగునూర్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, డీపీఓ సురేష్‌బాబుతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రణాళిక అధికారి నరహారి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూమిని ఇండ్ల స్థలాల భూములుగా మార్చి, అక్రమంగా అమ్మటం వల్లకొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారని, అటువంటి చట్టవ్యతిరేక పనులపై దృష్టి సారించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అక్రమ లె అవుట్లకు పాల్పడుతున్న వారిపై గతంలో ఏలాంటి చర్యలు తీసుకున్నారని, భవిష్యత్తులో ఏలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఆరా తీశారు. లెఅవుట్ చేసేటప్పుడు సమాచారం సమర్పించాల్సిన డాంక్యుమెంట్లపై వివరించారు. లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్‌కి లైసెన్స్ ఇచ్చే సమయంలో హౌజ్ ప్లానింగ్‌పై సూచనలు ఇచ్చారు. రోడ్లు, వీధీ లైట్లు, డ్రైనైజీ, మంచినీటి సరఫరా వంటి సమస్యలు ఏర్పడి ఫ్లాట్ల కొనుగోలు చేసిన వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, అక్రమంగా విక్రయించాలని యత్నిస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈసమీక్షంలో డీపీఓ సురేష్, వివిధ మండలాల పంచాయతీ కార్యదర్శులు, లెసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌లు పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 20: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని సీఐటీయు సంగారెడ్డి పట్టణ కార్యదర్శి బి.యాదవరెడ్డి డిమాండ్ చేసారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో దాదాపు 200 మంది వరకు వివిధ రకాల పనుల్లో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారన్నారు. వీరికి కనీస సౌకర్యాలు లేవని, కేవలం రూ.6 వేల వేతనంతో కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఒక యూనిఫాం ఇచ్చి రోజు అదే వేసుకుని రావాలని కార్మికులను వేధించడం సమంజసం కాదన్నారు. సంవత్సరానికి రెండు జతల బట్టలు, సేప్టీ షూ ఇవ్వాలన్నారు. కార్మికులందరికి క్యాంటిన్‌లో ఉచిత సౌకర్యం కల్పించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న నెల వేతనాలు, పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో సీఐటీయు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు మహబూబ్‌ఖాన్, యూనియన్ నాయకులు నాగరాజు, శేఖర్, జాను, కిరన్, అంజి, నర్సింలు, మహేందర్‌రెడ్డి, శోభ పాల్గొన్నారు.
నేడు జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 20: ఈ నెల 28 నిర్వహించే నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రమేష్, ఎన్.రమేష్‌లు పేర్కొన్నారు. విద్యార్థుల విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు 8, 9 తరగతుల విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి టాలెంట్ టెస్ట్, 16వ తేదీన మండల స్థాయి టెస్ట్ నిర్వహించి విజేతలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా స్థాయిలో టెస్ట్‌ను వెలుగు కార్యాలయం ఆవరణలో ఉన్న జిల్లా సైన్స్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తామన్నారు. అదే విధంగా ఈ నెల 27న హైదరాబాద్ ఎస్‌సీఈఆర్‌టీలో ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌కు పంపబతారన్నారు. ప్రతి మండలంలోని మండల స్థాయి విజేతలను తప్పకుండా పంపాలని వారు కోరారు.
సింగూర్ నుండి రా వాటర్, పంపు సెట్స్ నడుస్తున్నాయి
* జోగిపేట నగరపంచాయతీకి ట్రయల్ రన్ పూర్తి
* 1600 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో 75 కిలోమీటర్ల ట్రయల్ రన్ విజయవంతం* మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.సురేష్
మెదక్, ఫిబ్రవరి 20: మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ క్రింద 20 మండలాల్లో 873 గ్రామాలకు మార్చి 31 వరకు సింగూర్ నుండి రా వాటర్, పంపు షెడ్స్ నడుస్తున్నాయని మిషన్ భగీరథ మెదక్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. సింగూర్‌లో 12 పంపులు నడుస్తున్నట్లు తెలిపారు. 800 కోట్ల ప్రాజెక్ట్‌కుగాను 393 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో 18 ఓహెచ్‌బిఆర్, 10 సంపులు, 10 పంప్‌హౌస్‌లతో పాటు 1600 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. జోగిపేట నగరపంచాయితీ మార్గమధ్యలో తొమ్మిది గ్రామాలు, అందోల్, జోగిపేటకు సింగూర్ నుండి మంచినీటి సరఫరా కోసం ట్రయల్ రన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇది పూర్తిగా విజయవంతమైనట్లు తెలిపారు. ఒక మీటర్ పైప్‌లన్‌తో టేక్మాల్ గుట్టకు పంపింగ్ చేయడం జరిగిందన్నారు. ఈ పంపింగ్ గ్రావిటి ఓహెచ్‌బిఆర్ ట్రయల్ రన్ విజయవంతం అయిందన్నారు. రాయపాడు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ అర్బన్ సంప్ వరకు ట్రయల్ రన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 1600 కిలోమీటర్ల పైప్‌లన్ పరిధిలో 75 కిలోమీటర్ల ట్రయన్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన పైప్‌లైన్‌ను అంచలంచెలుగా పూర్తి చేసేందుకు పనుల ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. పంపింగ్ స్టేషన్లు మరో ఎనిమిది మిగిలాయన్నారు. వీటి పరిధిలో 26 పంపులు బిగించాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథ క్రింద 20 మండలాలు 873 గ్రామాలు ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మార్చి 31 వరకు సింగూర్ నుండి ట్రయల్ రన్ కార్యక్రమం పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఇంటింటికి మంచినీటి సరఫరా ఆర్‌డబ్ల్యూఎస్ కార్యక్రమంగా మిగిలిందన్నారు. పైప్‌లైన్ సరఫరాలో టాటా కంపెనీ, జై బాలాజీ, రష్మి, శ్రీకాలహాస్తి, శాతవాహన, ఎలక్ట్రో స్టీల్ కంపెనీల ద్వారా పైపులు సరఫరా అయ్యాయన్నారు. ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ పనులు ముమ్మరంగా కొనసాగాయన్నారు.