మెదక్

ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, ఫిబ్రవరి 20: తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తోందని పటనచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి పధకం పేరిట ఆపద సమయంలో వారికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించి ఆదుకుంటోందన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ తదితర పధకాల క్రింద మంజూరైన చెక్కులను పలువురు మహిళలకు అందించారు. నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్, పటేల్‌గుడ, కిష్టారెడ్డిపేట, ఇస్నాపూర్, ముత్తంగి, పాశమైలారం, పటన్‌చెరు తదితర గ్రామాలకు చెందిన 18 మంది కల్యాణలక్ష్మి లబ్దిదారులకు, 11 మంది షాదిముబారక్ లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందచేసారు. ఈ సంధర్బముగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాతనే ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతున్నారన్నారు. వివాహ సమయంలో ఈ రీతిలో భారీగా ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వాలు గతంలో లేవని ఆయన తేల్చిచెప్పారు. సుమారు 14 సంవత్సరాలు నిరంతరము పోరాటం చేసిన సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. బంగారు తెలంగాణే సాధనగా ఆయన బడుగు బలహీనవర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం పలు సంక్షేమ పధకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. కేవలం మూడున్నర సంవత్సరాల వయస్సు ఉన్న మన రాష్ట్రం భారతావనిలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. నిరాదరణకు గురైన కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించడంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారికి పునర్జీవాన్ని కల్పించిందన్నారు. వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్న సిఎం కెసిఆర్ అన్నదాతల పాలిట ప్రత్యక్షదైవంగా మారారనడంలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఇంతటితో ఆగకుండా వ్యవసాయదారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాబోయే జూన్ మాసంలో సాగుకు అవసరమైన పెట్టుబడి సాయం అందించడానికి సైతం ఆయన బృహత్తర పధకానికి రూపకల్పన చేసారన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పటన్‌చెరు ఎంపిపి శ్రీశైలం, రామచంద్రాపురం ఎంపిపి యాదగిరి, ఎంపిటిసిలు గడ్డయాదయ్య, భాసిత్, ఎంపిడిఓ అనంతరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

పోలీసుల గుప్పిట్లో
‘ఖాంజామల్‌పూర్’
జహీరాబాద్, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఖాంజామల్‌పూర్ (్భవానమ్మపల్లె) గ్రామంలో నెలకొన్న మత ఘర్షణల కారణంగా గ్రామం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. స్థానికంగా చెలరేగిన మత ఘర్షణలు ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామస్థులు మాత్రమే గ్రామంనుంచి బయటికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇతరులను గ్రామంలోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చిరాగ్‌పల్లినుంచి మండల కేంద్రమైన మొగుడంపల్లికి రాకపోకలు చేసేవారిని సైతం ఈ మార్గంలో అనుమతించడంలేదు. గ్రామానికి రెండు వైపుల కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామంలోనుంచి యువతను కూడా గుంపులు గుంపులుగా తిరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు సీఐ సదానాగరాజు తెలిపారు. కానీ గ్రామస్థులు భవానీ మందిరం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా క్రిస్టియన్ సామాజిక వర్గంవారు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రోడ్డుపై భైఠాయించి ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మిషన్ కాకతీయ పనులతో చెరువులకు మహర్దశ
* రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ రాంలింగారెడ్డి
మిరుదొడ్డి, ఫిబ్రవరి 20: మిషన్‌కాకతీయ పనులతో చెరువులు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్ సోలిపేట రాంలింగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అందె, అల్వాల,చెప్యాల,తడ్కపల్లి, కాసులాబాద్ గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు మంగళవారంనాడు శంఖుస్థాపన, ప్రారంబోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ పనులతో గ్రామాలలో అన్ని చెరువులకు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. చెరువులు, కుంటల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు పంపాలని కోరారు. మిషన్ కాకతీయ పనులు పూర్తి కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అదే విధంగా మండల పరిధిలోని తడ్కపల్లి గ్రామంలో కొండపొచమ్మరిజర్వు కాలువ నిర్మాణంలో భూములను కోల్పోతున్న వారికి ప్రభుత్వం డబ్బులను అందజేయడం జరిగిందన్నారు. కాల్వ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మండలంలోని అందె గ్రామంలో చెరువు, అల్వాల గ్రామంలో కుంటలలో మిషన్ కాకతీయ పనులకు శంఖుస్థాపన చేశారు. తడ్కపల్లిలో సిసి రోడ్లకు శంఖుస్థాపన చేశారు. చెప్యాల గ్రామంలో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కవిత, ఎంపిపి ఉపాధ్యక్షుడు బాల్‌రాజు, ఎంపిటిసిలు బైరయ్య, స్వామి, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు, టిఆర్‌ఎస్ నాయకుకులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యలపై మంత్రి నాయిని వ్యాఖ్యలు
* ఆనాలోచితంగా మాట్లాడటం సరికాదు* వెంటనే రైతు కుటుంబాలకు క్షమాపన చెప్పాలి * జడ్పీ ఫ్లోర్‌లీడర్ శ్రీకాంత్‌గౌడ్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 20: రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర హోంశాక మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆనాలోచితంగా మాట్లాడటం సరికాదని, ఈ అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గడిల శ్రీకాంత్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల సంఖ్యలో సగం వరకు బోగస్‌వే ఉన్నాయని స్వయంగా మంత్రి నాయిని పెర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.ఒక పెద్ద మనిషిగా గిట్టుబాటు ధర, రుణమాఫీ, విత్తనాల సరఫరాపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సింది పోయి ఇలాంటి వాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణమన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు మోసపోయి బ్రతకలేని స్థితిలో రైతులు జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన పాపన పోలేదని, చితికి పోయిన వారి కుటుంబాల స్థితిగతులపై ఇష్టారీతిగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. రైతుల పేరు మీద వేల కోట్ల రూపాయలను దండుకుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ కమిటీల్లో రైతులు కాని వారిని, అడుగులకు మడుగులోత్తే వారిని సభ్యులుగా నియమించినప్పుడే రైతులపై ఉన్న చిత్తశుద్ధి తెలిసిపోయిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందికర వాఖ్యలు చేస్తే రైతాంగాన్ని ఏకం చేసి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వివి నర్సింహా,నాయకులు దన్‌రాజ్, దుర్గసాయి, బాల్‌రాజ్, నిజామోద్దీన్‌బాబా, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

అట్రాసిటి కేసులను త్వరగా పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 20: జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.జగన్ మంగళవారం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం ద్వారా కోరారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో జనవరి 25వ తేదీన గ్రామ పంచాయతీ సమావేశం కొనసాగుతుండగా వార్డు సభ్యుడు రేండ్లపల్లి మోహన్‌పై సర్పంచ్ ఖాజానిజామొద్దీన్, అతని తండ్రి ఆరీఫోద్దీన్‌లు కులం పేరుతో దూసించి దాడి చేసినట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా దర్యాప్తు మాత్రం పెండింగ్‌లో ఉంచారన్నారు. ఈ అట్రాసిటీ కేసుతో పాటుగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి నింధితులపై చట్టరిత్యా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని జగన్ విజ్ఞప్తి చేసారు.