మెదక్

డీసీసీబీ సేవలు వినియోగించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 23: డీసీసీబీ బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్‌నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని డీసీసీబీ బ్యాంకులో మజీద్‌పల్లికి చెందిన మహిళా సంఘాల గ్రూపులకు రూ. 25లక్షల చెక్కు అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా డీసీసీబీ బ్యాంకులు మెరుగైన సేవలందిస్తుండగా, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెల్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ధేశించిన రుణ లక్ష్యాలను పూర్తి చేయడంలో తమ సంస్థ ఎంతో ముందుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో చిన్న, పెద్ద తరహా పరిశ్రమల ఏర్పాటు, చిరు వ్యాపారాలు, పంట రుణాలు, వివిద వాహనాల కొనుగోలు రుణాలతోపాటు బంగారంపై అతి తక్కువ వడ్డీతో రుణాలను ఇస్తున్నట్లు చెప్పారు. రుణాలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం ఉండదని వివరించారు.

అహ్మద్‌నగర్‌లో కేంద్ర బృందం పర్యటన
నర్సాపూర్,్ఫబ్రవరి 23: నర్సాపూర్ మండలంలోని అహ్మద్‌నగర్ గ్రామంలో శుక్రవారంనాడు కేంద్ర స్వచ్చ్భారత్ ప్రత్యేక పర్యవేక్షక బృందం పర్యటించింది. స్వచ్చ భారత్ ప్రత్యేక పర్యవేక్షక అధికారి వినీత్ సంగ్ ఆధ్వర్యంలో గ్రామాన్ని పరిశీలించారు. సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మరుగుదొడ్లు నిర్మించక ముందు మల విసర్జనకు ఉపయోగించిన స్ధలాలు ఇప్పుడు పరిశుభ్రంగా ఉండటం చూసి పంచాయతీరాజ్ కార్యదర్శి పృద్వీరాజ్, క్షేత్ర సహాయకుడు రాజులను అభినందించారు.

మహిళలు క్రీడల్లో రాణించాలి
*ఓయు ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 23: మహిళలు క్రీడల్లో రాణించడంతో పాటు వెనుకబాటుతనానికి దూరం కావాల్సిన అవసరం ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి హెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఓయు ఇంటర్ జోనల్ మహిళ క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మహిళలు ఆదర్శంగా నిలిచి మార్గదర్శకులుగా మారాలన్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ జోనల్ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటిమి గెలుపుకు పునాది వంటిదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహన కార్యదర్శి ప్రభు, వివిధ జిల్లాల మేనేజర్లు, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, పిడిలు పాల్గొన్నారు. ఓయు పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన మహిళ క్రీడాకారుల పోటీలు సిద్దిపేటలో రసవత్తరంగా సాగాయి. రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో చెస్‌లో హైద్రాబాద్ కస్తుర్బా గాంధి మహిళ కళాశాల ప్రథమ బహుమతి, సిద్దిపేట డిగ్రి కళాశాల ద్వితీయ, కబడ్డీలో కోటి మహిళ కళాశాల ప్రథమ, ఉమ్మడి హైద్రాబాద్ కళాశాల ద్వితీయ, వాలీబాల్‌లో హైద్రాబాద్ నిజాం కళాశాల ప్రథమ, ఉమ్మడి హైద్రాబాద్ కళాశాల ద్వితీయ, ఖోఖోలో కోఠి మహిళ కళాశాల ప్రథమ, ఉమ్మడి హైద్రాబాద్ కళాశాల ద్వితీయ, టెన్నికాయిట్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల ప్రథమ, ఉమ్మడి హైద్రాబాద్ జిల్లా ద్వితీయ బహుమతులను ఓయు ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందుకున్నారు.