మెదక్

సిద్దిపేటలో రచ్చకెక్కిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 11 : సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. గత కొంత కాలంగా . వర్గపోరులు, గ్రూపు విభేదాలకు పరిమితమైన నేతలు నడిరోడ్డుపై పరస్పర దాడులకు దిగి..బాహాబాహీకి తలపడి పార్టీ పరువును బజారుకీడ్చారు. సిద్దిపేట నియోజక వర్గంలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకుల పుణ్యమా అని పార్టీ పరిస్థితిని మరిత దిగజార్చారు. సిద్దిపేట నియోజక వర్గంలో పార్టీని నడిపించుకునే నాయకుడు కరువవ్వటంతో పార్టీ చుక్కాని లేని నావగా తయారైంది. సిద్దిపేట నియోజక వర్గానికి సమర్ధవంతమైన నాయకున్ని అప్పగిస్తామని కొన్ని దశాబ్ధాలుగా పార్టీ అధిష్టానం చెపుతూ వస్తుంది. కాని ఇంతవరకు పార్టీని నడిపించే నాయకున్ని మాత్రమే నియమించలేదు. సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం కరువైంది. సిద్దిపట నియోజక వర్గంలో నియోజక వర్గం ఇంచార్జీగా తాడూరి శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ వీవర్స్ సెల్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, నంగునూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు మండలానికి చెందిన డీసీసీ ప్రధానకార్యదర్శి మీసం నాగరాజు, జంగిటీ శ్రీనివాస్‌లు గ్రూపులుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఏవరికి వారుగా యమున తీరే వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు సైతులు గ్రూపు విభేదాలతో వ్యవరిస్తున్నారు. పార్టీని ఒక తాటిపై నడిపించే నాయకున్ని నియమించాలని పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి విన్నవించారు. గ్రూపువిభేదాల మూలంగా తమ అనుచరులకే పదవులు పార్టీ పదవులు ఇప్పించుకుంటున్నారు. ఈక్రమంలో నంగునూర్ మండలానికి చెందిన పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి చిన్నకోడూరు మండలంలో తమ అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించి కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నకోడూరు మండలానికి చెందిన మీసం నాగరాజు నంగునూర్‌లో మండలంలో తను చరులకు పార్టీ పదవులు ఇప్పించారు. దీంతో యాదగిరి, నాగరాజుల మధ్యనే విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలో ఈనెల 22న నంగునూర్ మండలం పాలమాకులలో మీసం నాగరాజు వర్గం పార్టీకార్యక్రమాన్ని నిర్వహించారు. నంగునూర్ మండలం చేరుకోగానే దేవులపల్లి యాదగిరి వర్గానికి చెందిన అనుచరులు మీసం నాగరాజతో పాటు, అనుచరులపై దాడి చేశారు. రోడ్డుపైనే పరస్పరం బాహాబాహీగా తలపడి, పార్టీ ప్రతిష్టను బజారు కీడ్చారు. ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ ఒకరిపై మరోకరు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధిష్టానం ఎవరి పై ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ఇప్పటికైన సిద్దిపేట నియోజక వర్గంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.