మెదక్

విద్యాభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, ఫిబ్రవరి 23: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. విద్యతో పాటు వైద్య రంగానికి అధిక ప్రాదాన్యతను ఇస్తూ నిరుపేదలకు నాణ్యమైన సేవలు ఉచితంగా అందేల అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను ఆదుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒకే రోజు 119 గురుకులాలు ప్రారంభించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. మైనారిటీలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రత్యేకంగా మైనారిటి గురుకులాలు ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో సరికొత్త చరిత్రకు నాంది పలికారన్నారు. విద్యార్థిని విద్యార్థులు వారి వారి తల్లిదండ్రుల ఆశయాల మేరకు విద్యను అభ్యసించాలని కోరారు. డిగ్రీ కళాశాల భవనాన్ని నూతనంగా నిర్మించడమే కాకుండా జూనియర్ కళాశాల భవనం, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేకంగా భవన నిర్మాణాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు. యువతీ యువకులకు అవసరమైన ఫర్నిచర్ కోసం మూడు లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నిరుపేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామన్నారు.

31పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
*ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి: డీఆర్‌ఓ రాములు
మెదక్, ఫిబ్రవరి 23: మార్చి 28 నుండి నిర్వహించే ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతవరణంలో నిర్వహించాలని డీఆర్‌ఓ రాములు సూచించారు. శుక్రవారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులకు నోడల్ అధికారి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ రాములు మాట్లాడుతూ పరీక్షల నిర్వాహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నేచర్, తాగునీరు, వసతి, ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లు సిద్దంగా ఉంచాలని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 16343 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాలకు చుట్టు ప్రక్కల ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఆయన ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వాహణలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు నెట్ సెంటర్ల ద్వారా డైన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని, ఆ విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లు డైన్‌లోడ్ చేసుకోవాలని, ఆ హాల్ టికెట్లతో పరీక్షా కేంద్రాలకు వస్తే అనుమతించడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అర గంట ముందు రావాలని, 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతించడం జరగదన్నారు. పరీక్షల సమయం పూర్తి అయ్యేంత వరకు విద్యార్థులకు బయటకు పంపడం పంపించడం జరగదని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలు తెలుసుకోవడం కోసం సెంటర్ లొకేషన్ యాప్‌లో తమ హాల్ టికెట్ నంబర్లు ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రం చూపిస్తుందని డీఆర్‌ఓ రాములు తెలిపారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నోడల్ అధికారి
జిల్లా నోడల్ అధికారి సూర్య ప్రకాశ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ అసోసియేషన్, మోడల్ స్కూల్, ఆర్‌జేడీ సంఘాల అసోసియేషన్ నాయకులు అశోక్, శ్రీనివాస్, శివకుమార్‌లు సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం నుండి బయటకు వెళ్లారు. చీఫ్ సూపరిండెంట్ డిపార్ట్‌మెంట్ అధికారుల నియామకంలో సంఘాల సహకారం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఆర్‌ఓ రాములు దృష్టికి తీసుకెళ్లారు. చేగుంట జూనియర్ కళాశాలలో 37 గదుల వసతి, సీసీ కెమెరాలు ఉన్నా స్నేహ ప్రైవేటు కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడంలో అంతర్యమేమిటని నోడల్ అధికారి సూర్యప్రకాశ్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ రాములు మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.