క్రైమ్/లీగల్

పత్తి రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, మార్చి 4: చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మరో పత్తి రైతు సంఘటన మండల పరిధిలోని పొట్టిపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చవిచూసింది. గత నెల 27వ తేదీన బాబిల్‌గావ్ గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరిచిపోకముందే మరోరైతు తనువు చాలించడంతో అన్నదాతల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇన్స్‌పెక్టర్ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామన్నోల నాగేశ్వర్ (48) చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తనకున్న రెండు ఎకరాల భూమితో పాటు మోహన్‌రెడ్డి, కలీల్‌లకు చెందిన మొత్తం 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేసాడు. ప్రకృతి వైఫరిత్యాల వల్ల పంట దిగుబడి ఆశించినంతగా రాలేదు. శనివారం సాయంత్రం 5 గంటలకు తన ద్విచక్ర వాహనంపై సదాశివపేటకు వెళుతున్నట్లు ఇంట్లో భార్య నాగేంద్రమ్మకు చెప్పి వెళ్లాడు. రాత్రికి ఇంటికి వెళ్లపోగా ఆదివారం ఉదయం భార్య నాగేంద్రమ్మ, అతని చిన్న కూతురు శిరీష వెతకగా మాచిరెడ్డిపల్లి గ్రామ శివారులోని రాజేశ్వర శర్మ వ్యవసాయ పొలంలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నట్టు పోలీసులు తెలిపారు.