మెదక్

ఈ-బైక్ ఛాలెంజ్ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్, మార్చి 13: నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో ఆసియా స్థాయి ఈ-బైక్ పోటీలు మంగళవారంనాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13నుంచి 16వరకు నిర్వహించనున్న ఇండియన్ ప్రొ-కార్డ్ ఎండరెన్స్ చాంపియన్ షిప్ (ఐపిఈసీ-2కె18) అండ్ ఆసియా ఈ-బైక్ ఛాలెంజ్ పేరుతో పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో దేశంలోని 50కళాశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు పాల్గొని ఈ-బైక్ మరియు గోకార్డ్ రేసింగ్ పోటీలలో తలపడనున్నారు. ఈసందర్భంగా మంగళవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు మాట్లాడుతూ విద్యార్థులు తమలోని సృజనను పెంచుకోవాలని సూచించారు. మారుతున్న అధునికతను అందిపుచ్చుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రోగ్రాం కన్వీనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ నిర్వహిస్తున్న ఈవెంటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న కార్య దీక్షకు అద్దంపట్టే విధంగా ఆటో క్రాస్, స్పీడ్ ప్యాడ్, బ్రేక్ టెస్టు వంటి అన్ని టెస్టులు నిర్వహిస్తామని అన్నారు. వెయ్యి మంది విద్యార్థులు వర్చువల్ అర్హత పొందగా, రెండు బృందాలు సరైన సమయంలో రాలేనందున నిషమ్రించాయని అన్నారు. ఈవెంటు కోసం అన్ని ఏర్పాట్లు చేసిన బీవీఆర్‌ఐటీ యాజమాన్యాన్ని అభినందినంచారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవిచంద్రన్‌రాజగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి ఈవెంట్లు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమాన్ని బేలూన్లు వదిలి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్లు రఘు, పద్మారావు, విక్రమ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆందోళన
జహీరాబాద్, మార్చి 13: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీనుంచి భహిష్కరించినందుకు నిరసనగా స్థానిక నాయకులు పట్టణంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ కార్యాలయంనుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు జాతీయ రహదారి మీదుగా భవాని క్రాస్ రోడ్డు వరకు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామాన్ని అపహాస్యం పాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించిన ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు కండెం నర్సిములు, మంకాల్‌సుభాష్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజిద్ తదితరులున్నారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి శాసన సభ ముగిసేవరకు బహిష్కరించటం, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్ ప్లెక్సి దగ్దం చేయటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈసంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, డీసీసీ మైనార్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్తుఇమామ్, కాంగ్రెస్ జిల్లా నేత జంగిటీ శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ఎక్బాల్‌మినార్ వద్ద సీఎం ప్లెక్సిని దగ్ధం చేసేందుకు యత్నించగా వన్‌టౌన్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలతో వాగ్వివాదం జరిగింది.