మెదక్

పెళ్లిలో రివర్స్ గేర్.. ముహూర్త దాటిపోతోందని పెళ్లికూతులు పరార్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 14: సంప్రదాయబద్దంగా జరగాల్సిన ఓ పెళ్లిలో రివర్స్ గేర్ పడింది. పెళ్లికొడుకు అతని తరపు బంధువుల హడావుడి చేయడం చేయడం షరా మామూలే కాని అందుకు విరుద్ధంగా పెళ్లికూతురు అమె తల్లి హంగామా. పురోహితులు నిర్ణయించిన ముహూర్త సమయం దాటి పోతోందని మండపం నుండి పరారైన సంఘటన ఇది. పటన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాలులో జరిగిన ఈ ఘటన అందిరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బుధవారం జరగాల్సిన పెళ్లి తంతు కాస్త అర్థాంతరంగా ఆగిపోయింది. పటన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడికి గత పక్షం రోజుల క్రితం పెళ్లి కుదిరింది. సింధూజ అనే యువతితో బంధువుల సమక్షంలో పెళ్లి ముహూర్తం నిర్ణయించుకున్నారు. 14న బుధవారం ఉదయం 7.36 నిమిషాలకు వివాహ ముహూర్తంగా పెట్టుకుని నిశ్చితార్థం సైతం జరిపించారు. ఇదిలా ఉండగా వెంకటేష్, సింధూజల మధ్య పెళ్లి సంబంధం కుదిర్చిన పెళ్లిళ్ల పేరయ్య అంజయ్య మాటలు నమ్మిన పెళ్లికొడుకు తరపు బంధువులు ఈ వివాహానికి సిద్ధ పడ్డారు. సిద్ధిపేటకు చెందిన అంజయ్య పెళ్లికూతురు విషయంలో వకాల్త పుచ్చుకుని వారు కడు బీదవారని నమ్మించాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం సింధూజ తల్లికి యాబది వేల రూపాయల నగదును ఇప్పించాడు. వధువుకు బంగారు ఉంగరం సైతం తొడిగి నిశ్చితార్థం జరిపించారని పెళ్లికొడుకు అతని బంధువులు తెలియచేసారు. నగదు అందించడమే కాకుండా పెళ్లికొడుకు తరపు వారు ఇస్నాపూర్‌లో బుధవారం పెళ్లికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి సమయానికి ఓ గంట ముందు మండపానికి వచ్చిన పెళ్లికూతురు సింధూజ, అమె తల్లి నిర్మల తీవ్ర హడావుడి చేసారు. పెళ్లికొడుకు తరపు వారితో గొడవ పడ్డారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం మించి పోతోందని పెళ్లి మండపం నుండి లేచి పరారవడానికి సిద్ధమయ్యారు. తమ వద్ద ఎక్కువ సమయం లేదని పరారయ్యారని ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశామని పెళ్లికొడుకు మీడియా ముందు వాపోయారు. వీరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పారిపోతున్న పెళ్లికూతురు తల్లి నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రకారం కేసు నమోదు చేసి పటన్‌చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.