మెదక్

ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ మార్చి 14: ప్రజల సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. సస్పెన్షన్‌తోపాటు సభ్యత్వం రఋ్ద చేయడం సమంజసం కాదని మాజీ ఎంపి సురేష్ శెట్కార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రజల పక్షాన ఏదైన అడుగ కుండా సస్పెండ్ చేస్తూ బయటకు పంపించడం దేశ చరత్రలోనే ఇది మొదటి సారి అని ఆయన నిశితంగా విమర్శించారు. ఇది కేసీఆర్ ఏక పక్షంగా బడ్జెట్, బిల్లులు అమోదింపజేకునేందుకేనని సురేస్‌శెట్కార్ అరోపించారు. రాష్ట్ర శాసన సభ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాం రద్దు, 11 ఎమ్మెల్యేలను బడ్జేట్ సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఖేడ్‌లో ధర్నా చేసేందుకు వెళ్లున్న మాజి ఎంపి సురేస్‌శెట్కార్‌నుకాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్ ముందు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోమాజి ఎంపి సురేస్‌శెట్కార్ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా ప్రతినిధుల నోరు మూయించి పాలన సాగించాలని చూస్తున్నారని కేసీఆర్ పరిపాలనపై విసుకు చెందిన రైతులు నిరుద్యోగ యువకులు ప్రజలు ఎన్నికలు వస్తే గద్దే దింపేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రజలురైతులు నిరుద్యోగుల సమస్యల పట్ల స్పికర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగుతుంటే వారి సమస్యలను వినిపించుకునే నాథుడు లేక పోతే ఆవేదనతో మైకు విసిరేశారని అన్నారు. స్వామిగౌడ్ కన్ను దెబ్బ తగుల లేదని అనవసరంగా రాద్దంత చేస్తూ ఎమ్మెల్యేల సభ్యత్వాం రద్దు బడ్జేట్ సమావేశాలు ముగిసేవరకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాని ఖుని చేస్తున్నారని టి అర్ ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు. టి అర్ ఎస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో టి అర్ ఎస్ పార్టీకి రాష్ట్రంలో భూస్థాపితం చేస్తారని అన్నారు. ఏక పక్షంగా రాష్ట్ర బడ్జేట్ బిల్లులను అమోదించుకునేందుకు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారని అరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మేజార్టీ అంటే 85 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారని అయన ధీమా వ్యక్తం చేశారు. ఇందులో యువనేత రాకేష్‌శెట్కార్, మాజి ఎంపిపిలు శంకరయ్యస్వామి,బాల్‌కిషన్; అనంద్‌శెట్కార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సి సేల్ అధ్యక్షులు బి,హన్మంతు, తాహెర్ అల్లి, జె ఏసీ ఇంచార్జి సంజివులు, తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
*టీపీసీసీ లీగల్‌సెల్ కన్వీనర్ రావుల చెన్నారెడ్డి
ములుగు, మార్చి 14: రాష్ట్రంలో కేసీఆర్ పాలన రాక్షస పాలనను తలపిస్తుందని దీనికి ప్రత్యక్ష నిదర్శనం అసెంబ్లీలో జరిగిన సంఘటనే సాక్షమని రాష్ట్ర టీపీసీసీ లీగల్, మానవ, సమాచార హక్కుల కన్వీనర్ రావుల చెన్నారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ములుగులో విలేఖరులతో మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని, శాసనసభలో జరిగిన ఘటనలను పూర్తిగా పక్కదారి పట్టించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాన్ని ఏక పక్షంగా రద్దు చేయడం నియంత పాలనను తలపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, స్వామి, నవీన్, విజయ్, అశ్వత్తామలు పాల్గొన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
* మ్మెల్యే చింతా ప్రభాకర్
కొండాపూర్, మార్చి 14: ఇచ్చిన హామిలతో పాటు ఇవ్వని హామిలను అమలు చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో బుధవారం పర్యటించి ఐదు కమ్యూటి భవనాలకు శంఖుస్థాపన, గ్రామ పంచాయతీ భవనం, అదనపు తరగతి గదులు, వాటర్ ట్యాంక్, సంప్‌లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 60యేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కొండాపూర్ మండలానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని, కరపత్రాలకే పరిమితమైన జగ్గారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల కాలంలో మండలంలో ఇప్పటి వరకు 216కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.