మెదక్

జ్యోషి చంద్రకాంత శర్మ సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 14: నాచగిరి దేవుడికి పరిపూర్ణమైన సేవలందించిన ఆస్థాన వేద పండితులు జ్యోషి చంద్రకాంతశర్మ సేవ లు మరువలేనివని, అయితే ఆయన సేవలు నాచగిరిలో మరిం త కాలం కొనసాగాలని ప్రముఖ వాస్తు సిద్దాంతి యాయవరం చంద్రశేఖరశర్మ, రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి, ధార్మిక పరిషత్ సభ్యులు వెంకటరమన శర్మ, ప్రముఖ వేద పండితులు మృత్యుంజయశర్మలు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ క్షేత్రంలో వేద పండితులు జ్యొషి చంద్రకాంత శర్మను మోకిరాల ప్రభాకరశర్మ వేద పురస్కారం అందజేసిన సందర్బంగా వారు మాట్లాడారు. జ్యోషి చంద్రకాంతశర్మకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ తోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిద ధార్మిక, సాహిత్య సేవా సంస్థ వివిద పురస్కారాలు అందజేయగా, రాష్టప్రతి వేద పండిత అవార్డు కు జ్యోషిచంద్రకాంతశర్మ అర్హుడని వారు స్పష్టం చేశారు. దీని ని దృష్టిలో పెట్టుకొని నాచగిరి క్షేత్ర పాలక మండలి, దేవాదా య శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. ముఖ్యంగా నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ క్షేత్రంతో ఎంతో అనుబందం ఉన్న జ్యొషి చంద్రకాంతశర్మ సారద్యంతో ఆలయం వద్ద ప్రముఖ వేద విద్వాంసుడు మల్లీనాదసూరి స్మారక వేద పాఠశాల ఏర్పాటు చేయాలని సూచించారు. అంతరించిపోతున్న వేద విద్యను నలు దిశలా వ్యాపింపజేసే క్రమంలో నాచగిరిలో ఏర్పాటు కానున్న మల్లీనాథ సూరి స్మారక వేద పాఠశాల మంచి ఔన్నత్యం పొందాలని ఆకాంక్షించారు. నాచగిరి క్షేత్రంలో 4 దశాబ్దాలుగా వేద పండితులుగా సేవలందించిన జ్యోషి చంద్రకాంతశర్మ వివాదరహితుడని, నిరాడంబరుడని వారు కొనియాడారు. గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతున్న నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ క్షేత్రం వద్ద అనుక్షణం వేదనాదం వినిపించాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం తీసుకుందామని వారు చెప్పారు. అలాగే నాచగిరిలో మోకిరాల ప్రభాకరశర్మ పేరిట వేదిక ఏర్పాటు చేసి అందులో ఆయన విగ్రహం ప్రతిష్టించాలని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ట్రస్టుబోర్డు చైర్మెన్ కొట్టాల యాదగిరి మాట్లాడుతూ జ్యోషి చంద్రకాంతశర్మ తన వేద విద్యతో అపారమైన శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకోగా అందులో తానూ ఒకడినని స్పష్టం చేశారు. జ్యోషి చంద్రకాంతశర్మ రాష్టప్రతి పురస్కారం కోసం సీఎం కేసీఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, అంతేగాకుండా ప్రముఖులు, వేద పండితులు చంద్రశేఖరశర్మ సూచించిన విదంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుదాకర్‌రెడ్డి, ప్రముఖ దేవ పండితులు జయకృష్ణశర్మ, రవీంద్రశర్మ, సలాక కృష్ణమూర్తిశర్మ, గోపాలకృష్ణశర్మ, అనంతగిరిశర్మ, శశిదరశర్మ, నాగరాజశర్మ, కృష్ణమాచార్యులు, జగన్నాదాచార్యులు, శ్రీనివాసరాఘవన్, బాలాజిగుప్త, సర్పంచ్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.