మెదక్

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 14: ఈనెల 15నుండి జరుగునున్న పదవతరగతి వార్షిక పరీక్షలకు సిద్దిపేట జిల్లాలో అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 362 పాఠశాలల్లో 14,803 విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. బాలికలు 8700, బాలురు 6103 పరీక్షలకు హాజరుకానున్నారు. 628 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్ష వ్రాయనున్నారు. జిల్లా పరిధిలో 80 సెంటర్లు ఏర్పాటు చేశారు. 80 మందీ చీప్ సూపరింటెండెంట్లు. 80 మంది డిపార్టుమెంట్ అధికారులు, 16 మంది రూట్ అధికారులను నియమించారు. జిల్లాలోని 20 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పదవ తరగతి పరీక్ష పేపర్లను భధ్రపర్చారు. 40 మందిని జాయింట్ కస్టోడియన్ అధికారులను ఏర్పాటు చేశారు. 17 కస్టోడియన్ సెంటర్లకు 11 మంది కస్టోడియన్లకు నియమించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 17 సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో పరీక్షలను పురస్కరించుకొని 5 ఫ్లయిండ్ స్కాడ్ టీంలు, 15 సెల్ప్ సెంటర్లతో సిట్టింగ్ స్కాడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 838 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అలాగే జీల్లాలో పరీక్షల పరిశీలన ప్రత్యేకాధికారిగా జగమోహన్‌ను నియమించారు. పదవతరగతి పరీక్షలను ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నాం 12-15 వరకు నియమిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు. అరగంట ముందే పరీక్ష సెంటర్‌లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల కోసం ఎఎన్‌ఎంలను నియమించారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటీ, ఫర్నిచర్, టాయలెట్స్ సౌకర్యాలు కల్పించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు యూనిఫాంలో కాకుండ జనరల్ దుస్తుల్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు బ్లూ, బ్లాక్ పెన్‌తో మాత్రం పరీక్ష వ్రాయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని అధికార యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండ జిల్లా విద్యాధికారులు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.