మెదక్

కేసీఆర్‌తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 18: తెలంగాణ రాష్ట్రం విలంబినామ సంవత్సరంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మరింత అభివృద్ది చెంది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవతరిస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. విలంబినామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర దశ, దిశ బాగుందని, వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డంకులు తొలగి రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని పంచాంగకర్తలు వెల్లడించడం అమితానందాన్ని కల్గించిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు కళాక్షేత్రంలో మున్సిపాలిటీ, బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవం, పంచాంగ శ్రావణ కార్యమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పండుగ అంటేనే ప్రజల మద్య జరుపుకునేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదిక వద్ద ఈ పండుగను జరుపుకోవాలనేదే తన ఆకాంక్ష అన్నారు. అందుకే పట్టణ ప్రజలు ఒకే వేదక వద్ద జరుపుకునేందుకు ఈ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కులమతాలకు అతీతంగా అందరు పండుగలు జరుపుకుంటరన్నారు. బంధు, మిత్రుల మద్య సుఖ సంతోషాలతోనే జరుపుకునేది పండుగ అన్నారు. కోమటిచెరువు కళాక్షేత్రంలో పట్టణ ప్రజల మద్య ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం తనకు మహానందం కల్గిందన్నారు. ఉగాది అంటేనే ప్రాశస్తమైన పండుగన్నారు. తెలుగు వారి తొలి పండుగ, కొత్త సంవత్సరం ప్రారంభమైన పండుగన్నారు. ఏ పండుగను ఏ రోజు జరుపుకోవాలో, శుభ దినాలు, వర్జ్యాలు, మంచి చెడులు అన్ని నిర్ణయించేది ఈ పండుగనే అని అన్నారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామన్నారు. ఈ ఏడు అంతా ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవిస్తూ తెలంగాణ సుభీక్షంగా ఉంటుందని పంచాంగకర్తలు ప్రకటించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు ప్రముఖ వేద పండితుడు ఉమాపతి రామేశ్వరశర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. సిద్దిపేట పట్టణం గూర్చి చెపుతూ ఈ ఏడు అన్ని రంగాల్లో మరింత కీర్తి గడించడం ఖాయమన్నారు. కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మూలాలే వేదాలన్నారు. కాలగమనాన్ని నిర్ణయించేది ఉగాదితోనే ప్రారంభమవుతాయన్నారు. బంగారు తెలంగాణగా ఈ రాష్ట్రం అవతరిస్తుందన్నారు. ఉగాది సంబరాల్లో బాగంగా సంగీత విభావరి, పేరిణి నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉగాది పచ్చడితో పాటు పోలెలు అందించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డిఆర్‌ఓ చంద్రశేఖర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి నాగరాజు శర్మ, ప్రతినిధులు రాధకృష్ణశర్మ, రంగాచారి, కృష్ణమాచారి, వెంకట నర్సింహచారి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఏఎంసి చైర్మన్ వెంకటరెడ్డి, ఎంపిపిలు యాదయ్య, శ్రీకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, ప్రభాకర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్ల హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలి
*ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
రిజర్వేషన్ల కోటా అమలుపై సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేంత వరకు పోరాటం చేస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉగాది వేడుకలు, పలు అభివృ ద్ధి పనుల శంకుస్థాపనకు ఎంపీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయించే రిజర్వేషన్ల అమలుతో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల కోటాపై రెండు వారాలుగా పార్లమెంట్‌లో నిరసన తెలపడం జరిగిందన్నారు.