మెదక్

సీసీ కెమెరా ప్రజాయుధంలా ఉపయోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 21: నేరాలను, దొంగతనాలను, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి శాంతి భద్రతల పరిక్షణకు పోలీసులు సీసీ కెమెరాలను వజ్రాయుధంలా ఉపయోగించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా పోలీసుల అధికారులతో ఎస్పీ నేర సమీక్షా నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల అదపుకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగు కేసుల వివరాలను ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలల్లో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయించాలని సూచించారు. ప్రతి పాఠశాల, సినిమా థీయెటర్, పెట్రోల్ బంకుల వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునెలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరుచుగా నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు ప్రయోగించాలని సంబంధిత అధికారులక సూచించారు. గంజాయిని సాగు చేసే వారిపై, అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. మాట్కా, పేకాట, ఇతర జూదంపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ అధికారులు వారి వారి పరిధిలో అర్ధరాత్రి సమయాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. అపరిచిత వ్యక్తుల సంచారం, అనుమానితులపై, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. డ్రోన్ కెమెరాతో మరింత నిఘా ఏర్పాటు చేసి నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్మాన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రజలకు నేర రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవగాహన కల్పించాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు శ్రీనివాస్‌కుమార్, నల్లమల రవి, సీతారం, డీసీఆర్‌బీ సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ పాలవెల్లి, ఐటీ కోర్ సీఐ లక్ష్మారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సంగారెడ్డి రూరల్ పోలీసులను అభినందించిన ఎస్పీ
జిల్లాలోని ఆయా బ్యాంకుల వద్ద మాటు వేసి బ్యాంకు వినియోగదారుల దృష్టి మరల్చి డబ్బులను లాక్కుపోతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సంగారెడ్డి రూరల్ సీఐ నరేందర్, ఎఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లు కె.మహేష్, ఎం.రాజు, అతిక్ అహ్మద్, బి.రమేష్, శాకీరుద్దీన్, గౌరి, రాచయ్యలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులకు నగదు రివార్డును ప్రకటించి అందజేసారు. జిల్లా పోలీసులంతా ఇదే స్ఫూర్తితో విధి నిర్వహణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సంగారెడ్డి జిల్లాను నేర రహితంగా చేస్తారనే విశ్వాసం ఉందన్నారు.

మిషన్ న్‌భగీరథ ప్రాజెక్టును పరిశీలించిన కేరళ బృందం
గజ్వేల్, మార్చి 21: కోమటిబండలోని మిశన్‌భగీరథ ప్రాజెక్టును బుధవారం కేరళ రాష్ట్ర అధికారులు, మీడియా బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా మిషన్ భగీరథ పథకం పనితీరును ఈఈ రాజయ్య, డిప్యూటీ ఈఈలు నాగార్జున, కమలాకర్‌ల అధికారుల బృందం కేరళ రాష్ట్ర కొట్టాయం జిల్లా పౌర సరఫరాల అధికారి తామస్, ఇతర అధికారులు మీడియా బృందానికి వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాహార్తి నివారణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఫలితాలు సాదిస్తోందని స్పష్టం చేశారు.