మెదక్

ట్రైడెంట్‌లో సీఐటీయూ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, మార్చి 21: మండలంలోని కొత్తూర్‌లోగల ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో బుధవారం గుర్తింపు కార్మిక సంఘం కోసం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సీఐటీయు విజయం సాధించింది. కర్మాగారంలోని 198 ఓట్లకుగాను గెలుపొందిన సీఐటీయుకు 96 ఓట్లు పోలవగా ప్రత్యర్థి సంఘం హెచ్‌ఎంఎస్‌కు 92 ఓట్లు పోలయ్యాయి. దీంతో 2 ఓట్ల మెజార్టీతో సీఐటీయు గెలుపొందింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ బీరం మల్లేషం మాట్లాడుతూ ఈ విజయం కార్మికులదేనన్నారు. వారికే ఈ గెలుపును అంకితం చేస్తున్నామన్నారు. కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం సాధిస్తామన్నారు. ఇతర సమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తామన్నారు. కార్మికులను మోసం చేసిన హెచ్‌ఎంఎస్ అనేక ప్రలోభాలకు గురిచేసినా కార్మికులు మాత్రం సీఐటీయుకు పట్టం కట్టడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా కార్మికులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేక వాహనంలో అధ్యక్షు ఇతర నాయకులను కర్మాగారం గేటునుంచి కొత్తూర్ వరకు అక్కడినుంచి రహాదారీ మీదుగా జహీరాబాద్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.రాంచందర్, మహిపాల్, సాయిలు, రాజిరెడ్డి, చంద్రశేఖర్, యూసూఫ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు కొని సాగుచేసుకునేవారికి హక్కులు
*జడ్పీవైస్ చైర్మన్ సారయ్య
సిద్దిపేట, మార్చి 21: ప్రభుత్వ అసైన్డ్ భూములు కొనుగోలు చేసి..వ్యవసాయ చేసుకునే నిరుపేదలకు తెలంగాణ సర్కార్ భూమిపై హక్కులు కల్పించనున్నట్లు జడ్పీవైస్ చైర్మన్ సారయ్య అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ భూములు కొన్న వారికి రీ అసైన్ చేసే విషయంపై ప్రజాప్రతినిధులు, తహశీల్దార్లకు ఆర్డీఓ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్పీచైర్మన్ సారయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకునే అర్హులు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ భూములపై సర్వ హక్కులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూములు విక్రయించిన, కొనుగొలు చేసిన నేరంగా పరిగణించేవారు. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ భూములపై అర్హులైన వారికి హక్కులు కల్పించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 31 డిసెంబర్ 2014 లోపు కొనుగోలు చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా శ్రమించాలి
*ఏఐసీసీ సభ్యురాలు సునీతాలక్ష్మారెడ్డి
గజ్వేల్, మార్చి 21: మెదక్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని ఉమ్మడి మెదక్ జిల్లా చీఫ్, ఏఐసీసీ సభ్యురాలు సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమెను ఘనంగా సన్మానించిన సందర్బంగా మాట్లాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, రాష్ట్రం లో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ పేద ప్రజలకు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌లు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విదానాలను ప్రజల్లో చైతన్యం చేయాలని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఆందోళనలు చేపట్టాలని కోరారు. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను అనర్హులుగా ప్రకటించడం సిగ్గుచేటని, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ సీఎం కేసీఆర్ వత్తడికి తలొగ్గి ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాటం చెబుతారని, యువనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా ముందుకెల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేతలు బానుప్రకాశ్‌రావు, లక్ష్మన్, కిష్టారెడ్డి, వెంకట్ గౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.