మెదక్

కలెక్టర్ హెచ్చరికతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, మార్చి 21: పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత హారం పథకం ద్వారా నాటిన చెట్ల పరిరక్షణ కోసం ప్రభుత్వ యాంత్రంగం బుధవారం నుండి పరుగులు పెడుతుంది. హరితహారం పథకం ద్వారా గ్రామాలలో నాటిన చెట్ల పరిరక్షణలోనిర్లక్ష్యం వహిస్తే దానికి బాధ్యులు స్థానిక ఎంపీడీఓలదే అన్న జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆదేశాలతో ఆయా గ్రామాల ఇంచార్జి అధికారులు గ్రామలలో సంచరిస్తూ నాటిన చెట్లను పర్యవేక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆటవిశాఖ, ఉపాధిహామీ పథకం ద్వారా మండలంలో 7 లక్షలకు పైగా చెట్లను నాటి వాటి సంరక్షణ కోసం హరిత సైనికులను నియమించారు. అలాగే నాటిన ప్రతి మొక్కను కాపాడే విదంగా సంబందిత గ్రామ కార్యదర్శులతో పాటు ఇంచార్జీ అధికారులకు బాధ్యతలు అప్పగించి మార్గనిర్ధేశం చేశారు. ఈ క్రమంలో నాటిన చెట్లకు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించడంతో పాటు వాటికి రక్షణ కవాచాలను ఎప్పటికప్పుడు సరి చేయడం, ఎండిన చెట్ల స్థానంలో మరోమొక్కను నాటం లాంటి చర్యలు చెపట్టారు. ఆయితే ఇవన్ని బాగనే ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలలో చెట్లకు నీరు అందించే క్రమంలో కొందరు వాటర్ ట్యాంకర్ నిర్వహకులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో నాటిన మ్కొక్కలు ఎండిపోతున్నాయి. అలాగే మరికొన్ని గ్రామాలలో రొడ్డుకు ఇరువైపుల నాటిన చెట్లకు రక్షణ కవాచాలు ఏర్పాటు చెయక పోవడం మూలంగా మూగజీవాలకు ఆహారంగా మారుతున్నాయి. కాగా చెట్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్న వాటిని సద్వినియోగం చేయడంలో క్రింది స్తాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తుండంతోనే ప్రభుత్వ ఆశయం నేరవెరటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాలలో సహితం చెట్లకు రక్షణ కవాచాలు కొనుగోలు చేసిన వాటిని చెట్లకు అమర్చకుండా వృధాగా వదిలేస్తున్నారు. పై స్థాయి అధికారులు తనీఖీలు చేసి హెచ్చరించినప్పుడే మండల స్థాయి అధికారులు గ్రామాలలో పర్యటిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడంతో పాటు అందరి బాగస్వామ్యం ఉంటే తప్ప హరితరక్షణ సాధ్యం కాదని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలు
అమీన్‌పూర్ మార్చి 21: మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు రోజు రోజుకు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కి కుచించుకుపోతున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు వంత పాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలో వేల ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి రోజుకింత కనుమరుగు అవుతుంది. ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వానికి సమకూర్చాల్సిన ఆదాయం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుంది. తాజాగా సర్వేనెంబర్ 462లో ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడు సుమారు 720 గజాల స్థలాన్ని ఆక్రమించి ప్రహారిగోడ నిర్మించగా రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అయినప్పటికీ సదరు స్థలంలో ఆ నాయకుడు ప్రహారిగోడ పునర్ నిర్మాణానికి పూనుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరో నాయకుడు బీరంగూడ శివాలయం పక్కనే ఉన్న 200 గజాల పైచీలుకు స్థలాన్ని ఆక్రమించి పిల్లర్లు నిర్మాణం చేపట్టారు. నిర్మాణాన్ని అడ్డుకున్న రెవెన్యూ అధికారులు తిరిగి చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అదే స్థలంలో బేసిమీట్ తదితర నిర్మాణ పనులు తిరిగి ఊపందుకున్నాయి. అమీన్‌పూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఎక్కడో ఒక చోట కబ్జాల పర్వం ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయి. కళ్లముందే ఈ వ్యవహారం చోటుచేసుకుంటున్నా అధికారులు కాసుల మత్తులో మునిగితేలుతున్నారన్న విమర్శలున్నాయి. మరి కొందరు అక్రమార్కుల నుంచి అధికారులు లంచాలు దండుకొని వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.