మెదక్

27 సంవత్సరాల తర్వాత మెదక్ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 22: మెదక్ పురపాలక సంఘంలో 27 సంవత్సరాల తర్వాత రివైజ్‌డ్ మాస్టర్‌ప్లాన్‌ను రూపకల్పన చేసేందుకు డీ డీ ఎఫ్.ను నియామకం చేసినట్లు మెదక్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గురువారం నాడు ఢిల్లీకి చెందిన కన్సల్టెంట్లు మెదక్ పురపాలక సంఘంలో పర్యటించారని ఆయన తెలిపారు. ఈ రివైజ్డ్ మాస్టర్ పా లన్‌ను అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం కోసం తొమ్మిది నెలలు, తొమ్మి ది దశలు పడుతుందని ఆయన చెప్పారు. ఛైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అధ్యక్షతన 18 శాఖల అధికారులతో సమావేశమై పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ముందస్తు ప్రణాళికను ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్‌ను రూపుదిద్దడం జరుగుతుందని చెప్పారు. రాష్త్రంలో 20 మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ రివైజ్ చేసే కార్యక్రమంలో మెదక్ పురపాలక సంఘం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ రూపకల్పనలో డీ డీ ఎఫ్. మెదక్‌కు రావడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం మెదక్ పట్టణంలో 63 వేలు నివాస గృహాలు ఉన్నట్లు చెప్పారు. మున్సిపల్ ఆదాయం 3.17 కోట్లు డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ (కమర్షియల్) 1276, గృహాలు 1276, మిక్స్‌డ్ రెసిడెన్షియల్ 198 ఉన్నట్లు ఆయన చెప్పారు. జనాభా ప్రస్తుతం 49 వేలు ఉండగా అవుసులపల్లి, ఔరంగాబాద్, పిల్లికొట్టాల్ గ్రామాలు మెదక్ పురపాలక సంఘంలో విలీనమవుతున్నందున మరో 5 వేల జనాభా కలుస్తుందని ఆయన చెప్పారు. దాంతో 54 వేల జనాభా ఉంటుందని ఆయన చెప్పారు. పట్టణ విస్తర్ణం 24 స్వ్కేర్ కిలోమీటర్లు పెరుగుతుందని చెప్పారు. 27 సంవత్సరాల తర్వాత రివైజ్ మాస్టర్ ప్లాన్ జరగడం అభివృద్ధికి నాంది జరుగుతుందని చెప్పారు.

ఆర్టీసీలో ఎస్సీ, ఎస్టీలకు
న్యాయం జరగడం లేదు..
*రాష్త్ర ప్రధాన కార్యదర్శి పద్మారావు ఆరోపణ
మెదక్, మార్చి 22: రాష్త్ర రవాణా సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సమాన న్యాయం జరగడంలేదని రాష్త్ర రవాణా సంస్థ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి పి.పద్మారావు మాట్లాడుతూ తెలిపారు. గురువారం నాడు మెదక్ రహదారి బంగ్లాలో జరిగిన ఆర్టీసీ రీజియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 20 వేల మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు న్యాయం జరగడంలేదని ఆయన ఆరోపించారు. దళితులను ఎదగనివ్వడంలేదని ఆయన అన్నారు. ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగపరంగా మేనేజ్‌మెంట్ ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగ కోటా, ప్రమోషన్ ఇవ్వడంలేదని ఆరోపించారు. ఆర్టీసీ అధికారులతో రాష్త్ర ముఖ్యమంత్రి సమావేశమై ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు కూడా ఘ నంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ రాష్త్ర నాయకులు బాబు, స్వర్ణరాజు, మొగులయ్య, మల్లేశం ఉన్నారు.

అంగీకారం లేకుండా వేతనంలో కోతలు వద్దు
సంగారెడ్డి టౌన్, మార్చి 22: ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వేతనంలో కోతలు విధించడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి, కంది మండలాల విద్యాధికారి కె.వెంకట నర్సింలుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు 127 ప్రకారం అంగీకారం పత్రం ఇచ్చిన వారి నుండి మాత్రమే ఒక రోజు వేతనాన్ని కట్ చేయాలన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం డీడీఓ ఉద్యోగి వేతనం నుండి అతని అంగీకారం లేకుండా ఎలాంటి మినాహాయింపులు చేయరాదన్నారు. ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే డీడీఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నాసర్ పటేల్, సర్పరాజ్, వరప్రకాష్, విజయానంద్, జగన్‌మోహన్, వహిద్‌పాషా, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.