మెదక్

దేవాలయాల అభివృద్ధికి రూ. 1.10 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 22 : సిద్దిపేట జిల్లాలో ఆలయ అభివృద్ధికి 1.10 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ప్రాచిన పురాతన ఆలయాలకు ప్రభుత్వం అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తుందన్నారు. గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న ఏకైన ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు జిల్లాలో ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసుకున్నట్లు తెలిపారు. కొత్తగా కొన్ని దేవాలయాలకు 1.10 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో విలీనమైన మద్దూరు మండలం బెక్కల్ గ్రామ గుట్టపై వెలసిన పురాత చారిత్రాత్మక ఆలయం రామలింగేశ్వర ఆలయం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా సిద్దిపేట నియోజక వర్గంలోని సిద్దిపేట మండలం మాచాపూర్‌లో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి 10లక్షలు, పొన్నాల గ్రామంలో పెద్దమ్మ దేవాలయానికి 10లక్షలు, ఇబ్రహీంపూర్ గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి 10లక్షలు, నంగునూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో గుంటి మల్లికార్జునస్వామి నిర్మాణానికి 10లక్షలు, పెద్దమ్మ ఆలయానికి 10 లక్షలు, గజ్వేల్ నియోజక వర్గంలోని సింగాటం గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి 10లక్షలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు.

ప్రభుత్వానికి నిమ్జ్ భూసేకరణ నివేదిక: జేసీ
జహీరాబాద్, మార్చి 22: నిమ్జ్ భూ సేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న పలు గ్రామాల రైతులతో గురువారం జేసీ కె.నిఖిల సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి న్యాల్‌కల్ మండలం బసంత్‌పూర్, మొల్కన్‌పాడ్ గ్రామాలకు చెందిన రైతులు, తహసిల్దారు దశరథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ నిమ్జ్‌లో కోల్పోతున్న తమ భూములకు ఎకరాకు రూ.40లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌కు గల కారణాలను వారు జేసీకి వివరించారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న తమకు ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చేయూత నివ్వాలన్నారు. అందుకు సరీపోను కనీసం ఎకరాకు రూ.40లక్షల భూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తమ డిమాండ్‌ను సానుకూల దృక్పథంతో పరీశీలించాలన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిమ్జ్ భూములకు నష్టపరిహారం ఎకరాకు అత్యధికంగా రూ.7లక్షలు ఇవ్వనుందని జేసీ వెల్లడించారు. ఇందుకు రైతులు ససేమిరా అనడంతో సమావేశాన్ని ముగించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం చిల్లిస్తున్న ధర రూ.7వేలకు రైతులు డిమాండ్ చేస్తున్న రూ.40వేలకు చాలా వెత్యాసం ఉందన్నారు. ఏదేమైనా తమ నివేధికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణ ఏజెన్సీలతో కూడా సమావేశం నిర్వహించామని, పనుల్లో వేగం పెంచాలని సూచించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నిమ్జ్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్.శివరామ్, ఆర్డీఓ.అబ్దుల్ హమీద్, బసంత్‌పూర్ సర్పంచ్ పాండురంగారెడ్డి రైతులు, అధికారులు పాల్గొన్నారు.