మెదక్

వ్యవ‘సాయా’నికి సమితుల చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, మార్చి 23: రైతు సంఘటిత శక్తికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించిన అధికారులు సమన్వయ సమితుల చైతన్యానికి సమాయత్తం అయ్యారు. సమితిల సభ్యులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లాలో ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. జిల్లాలో 2 లక్షల 20 వేల మంది రైతులకు చెందిన 3 లక్షల 20 వేల ఎకరాలకు రైతు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. పూర్తి భూ ప్రక్షాళన అనంతరం రైతుల సంఖ్య, విస్తీర్ణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 నుండి అందజేసే పెట్టుబడి సాయం పథకంలో అన్ని గ్రామాల్లో గ్రామ రెవెన్యు అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి, రైతు సమన్వయ సమితి సభ్యుల సమక్షంలో చెక్కుల పంపిణీ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు లబ్ది చేకూర్చే అంశంపై రైతులను చైతన్యపర్చడంతోపాటు ఈ పథకానికి రైతులు దరఖాస్తు చేసుకునే అంశంపై అవగాహన రైతు సమితి సభ్యులకు కల్పిస్తారు. క్రాప్ కాలనీలు ఏవిధంగా నిర్దారించుకోవాలి, వాటికి అనువైన నేలలు, పంటల సాగు అంశాలను సమితి సభ్యులకు తెలియజేస్తారు. ఆహార అవసరాలకనుగుణంగా వ్యవసాయ అధికారులు సూచించిన వివిధ పంటలను సాగుచేసేలా రైతులను సమితి సభ్యులు ప్రోత్సహించాల్సిన అంశాలను తెలియజేస్తారు. రైతులు పండించిన పంటల నుండి విత్తనశుద్ది చేసే పరిశ్రమలను సమన్వయసమితిల ఆధ్వర్యంలో సహకారం సంఘాల సహకారంతో యూనిట్‌లు ఏర్పాటు చేసుకోవడానికి రైతులకు అవగాహన కల్పించేందుకు రైతులకు తెలియజేస్తారు. గోదాంలో వివిధ పంటల ధాన్యం నిల్వ ఉంచేందుకు ఆయా సమన్వయసమితిల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న గోదాంలపై అవగాహన కల్పించి ధాన్యాన్ని ప్రభుత్వ గోదాంలో నిల్వ ఉంచేలా తెలియజేస్తారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగం, సబ్సిడీ యంత్రాల వాడకంపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా ఉండి సమితి చేయాల్సిన పనులను విజయవంతంగా పూర్తిచేసేందుకు చైతన్యపరుస్తారు. రైతులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతు వారి అభిప్రాయాలను తెలుసుకొని సూచనలు చేసేలా అవగాహన కల్పిస్తారు. పంటలకు మద్దతు ధరను రైతులకు అందించేలా సమితిలు సంఘటితంగా పనిచేసేలా తీర్మాణాలు చేయించి, సమన్వయ సమితి కర్తవ్యాలు నిర్వర్తించేలా కృషిచేస్తారు. ఎరువులు, విత్తనాలు ఏయే సమయంలో రైతులకు అందజేయాలన్న అంశంపై రైతులు, అధికారులకు సమన్వయకర్తలుగా వ్యవహరించి కల్తీ నివారణకు కృషి చేసేలా రైతు సమన్వయ సమితి సభ్యులకు సూచనలు చేస్తారు.
* 77 క్లస్టర్‌లలో శిక్షణలు: జిల్లా వ్యవసాయాధికారి పరశురాం
జిల్లాలో వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన 77 క్లస్టర్‌లలో క్లస్టర్‌ల వారిగా రైతు సమన్వయ సమితి సభ్యులకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం తెలిపారు. క్లస్టర్‌ల వారిగా భవనాల నిర్మాణాల కోసం దాతల నుండి ఉచితంగా స్థలాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై సమన్వయసమితిలు వారికి పరిచయమున్న ఔత్సాహికుల నుండి భూ, ధన రూపేణా సేకరించాలని కోరారు.

నేడు డిప్యూటీ స్పీకర్ పద్మ నియోజకవర్గంలో పర్యటన
మెదక్ టౌన్, మార్చి 23: తెలంగాణ శాసనసభ ఉపసభాపతి, స్థానిక ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ఈ నెల 24న మెదక్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు కార్యాలయం పిఆర్‌ఓ ఎస్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఉదయం 8 గంటలకు పాపన్నపేట మండలం అబ్లాపూర్ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మెదక్ పట్టణంలోని 17వ వార్డులో గల పెద్దబజార్‌లో 14వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన 50 లక్షల రూపాయల విలువైన పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే సిసి రోడ్డు నిర్మాణం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో టిబి పరీక్షల యంత్రాన్ని ప్రారంభిస్తారు. మిలిటరీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంస్తారు. మార్కెట్ కమిటీలో వివిధ పనులకు శంఖుస్థాపన గావిస్తారు. అనంతరం రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు.