మెదక్

బీజేపీకి అంజిరెడ్డి దంపతుల రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, మార్చి 24: గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పటాన్‌చెరు శాసనసభకు పోటీచేసిన ఎస్‌ఆర్ ట్రస్టు అధినేత సీ అంజిరెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన సతీమణి గోదావరి కూడా పార్టీలో చేసి నియోజకవర్గ రాజకియాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. వీరి సేవలను గుర్తించిన బీజేపి అధిష్టానం అంజిరెడ్డికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, గోదావరిని బీజేపి రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శులుగా పదవులు ఇచ్చింది. గత మూడేళ్లుగా నియోజకవర్గంలో పార్టి బలోపేతానికి పాటుపడిన ఈ ఇద్దరూ క్రియాశీలక రాజకీయాలను నడిపించారు. రాజకీయ గురువు నాగం జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు సమస్యలపై పోరాటం చేశారు. అయితే టీ ఆర్ ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాటం చేస్తుంటే రాష్ట్రంలో బీజేపీ, టీ ఆర్ ఎస్‌లు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం నాగం బీజేపికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీజేపిలో ఎదుగుదల లేదనుకుని ఆలోచించిన అంజిరెడ్డి దంపతులు కూడా శనివారం బీజేపి పార్టి సభ్యత్వానికి, పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను పార్టి అధిష్టానానికి ఫాక్స్‌లో పంపిన అనంతరం రామచంద్రాపురంలోని వారి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగం బాటలోనే తాము పార్టికి రాజీనామా చేస్తున్నట్లు వారు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వారి వెంట నియోజకవర్గంలోని పార్టి అనుచరులు, వారి అభిమానులు కూడా పార్టీకి రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాల సందర్భంగా అంజిరెడ్డి, గోదావరిలు మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ భవిష్యత్తు నేడు టీ ఆర్ ఎస్, బీజేపీల వల్ల అగమ్యగోచరంగా మారిందన్నారు. అవినీతి, అసమర్ధ పాలన రాష్ట్రంలో ఎక్కువైందని, దీనికి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా సహకరించడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై నాగం బాటలోనే తాము వెల్లనున్నామని, నియోజకవర్గ ప్రజల, అనుచరుల నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీలకతీతంగా తమ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు చేస్తూనే ఉంటామని వారు తెలిపారు. రాజీ నామా చేసిన వారిలో బీజేవై ఎం, మహిళమోర్చా, ఎబివీపీ, కిసాన్ మోర్చా తదితర నాయకులు కూడా ఉన్నారు.

కుటుంబ పాలనకే పరిమితమైన కేసీఆర్ ప్రభుత్వం
హత్నూర, మార్చి 24: బంగారు తెలంగాణ చేస్తామంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు మయం చేసుకుంటున్నాడని మాజీ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం హత్నూర మండలం దౌల్తాబాద్ సమీపంలోని బీఎన్‌రెడ్డి గార్డెన్‌లో మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలకు వస్తాయని ఎదిరిచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లు గడుస్తున్న ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. అంతేకాకుండా భూ కబ్జాదారులకు వత్తాసు పలకడంతో పాటు ఇసుక మాఫీయాతో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కై దందాలు కొనసాగిస్తుందని విమర్శించారు. కమీషన్ల పాలన కొనసాగిస్తూ భారీ కుంభకోణాలకు పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు కలరింగ్ ఇస్తూ తామే చేపట్టామని చెప్పడం సిగ్గుచేటన్నారు. సింగూర్ జలాలను జిల్లాకు కేటాయించకుండా రాజకీయ లబ్ధికోసం శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తరలించుకుపోవడం దుర్మార్గమన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.3వేల నిరుద్యోగ బృతి చెల్లిస్తామన్నారు. ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసిలు ఆశయ్య, శశికళ, నాయకులు వెంకటేశం, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.