మెదక్

రైతు బాంధవుడు కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 24: రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన రైతుగా, ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ రైతు బాంధవుడని ఉపసభాపతి ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. రైతు పెట్టుబడి సాయంకింద 12 వేల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ సమితిలు రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని ఆమె సూచించారు. శనివారం మెదక్‌లో రైతు సమన్వయ సమితి సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ అప్పులద్వారానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆత్మహత్యలులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రైతులకు సా యం చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడికింద ఎకరాకు 4 వేల రూపాయలు సాగువిస్తీర్ణంతో సంబంధం లేకుండా ఏప్రిల్ 20 నుండి రైతులందరికి అందజేస్తున్నట్లు చెప్పారు. రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ ముందుకుసాగుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ఇటీవల తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు సమన్వయసమితిలు వారి వారి విధుల పట్ల పూర్తి అవగాహన పొంది కనీస మద్దతు ధర, ధాన్యం సేకరణ, దళారుల నియంత్రణవంటి కార్యక్రమాల్లో చురకుగా పాల్గొనాలన్నారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతులు సంఘటితంతోనే అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఐక్యంగా లేకపోవడంతో గతంలో దళారుల చేతిలో మోసపోయేవారన్నారు. అలాంటిది జరగకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతు సమన్వయ సమితిల ద్వారా దళారుల నియంత్రణ జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం సదుద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ సమితిలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త తాడెపు సోములు మాట్లాడుతూ గ్రామాల వారిగా రైతు సమన్వయసమితిలకు రైతు వేదిక భవనాలు నిర్మించేందుకు దాతల సహకారంతో స్థలాలు సేకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం 20 వేదికలను నిర్మించేందుకు నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. త్వరితగతిన స్థలాలను సేకరించినట్లయితే భవనాలు నిర్మాణం చేయించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కరపత్రాలను ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్, ఎడిఎ మనోహర, మండల సమన్వయకర్తలు కిషన్‌గౌడ్, శ్రీహరి, జిల్లా సమితి సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
ఏఎంసిలో వే బ్రిడ్జీ ప్రారంభం
మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో 60 మెట్రిక్ టన్నుల సామర్ద్యం గల ధర్మకాంటను ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌లో పశువులను నిలిపేందుకోసం నిర్మించే షెడ్‌కు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎఎంసి చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, ఆర్‌డిఓ నగేశ్, వైస్‌చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.